Telugu Global
NEWS

సాహిత్య పఠనా శక్తిని పెంచిన సులోచనారాణి

విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో ఈ నెల రెండవ తేదీన ‘ తెలుగులో పఠనాసక్తిని పెంపొందించడంలో యద్దనపూడి సులోచనారాణి పాత్ర ‘ అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ముఖ్యవక్తగా మాట్లాడుతూ ‘సులోచనారాణి మధ్య తరగతి ప్రజల జీవన సంఘర్షణలను గొప్పగా ఆవిష్కరించారని’ అన్నారు. మరో వక్త డా. వాడ్రేవు వీరలక్ష్మిదేవి ‘మానవ సంబంధాలను ఆమె చూపినంత హృద్యంగా మరెవరూ చూపించలేరని’ అన్నారు. […]

సాహిత్య పఠనా శక్తిని పెంచిన సులోచనారాణి
X

విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో ఈ నెల రెండవ తేదీన ‘ తెలుగులో పఠనాసక్తిని పెంపొందించడంలో యద్దనపూడి సులోచనారాణి పాత్ర ‘ అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించారు.

ఈ సదస్సులో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ముఖ్యవక్తగా మాట్లాడుతూ ‘సులోచనారాణి మధ్య తరగతి ప్రజల జీవన సంఘర్షణలను గొప్పగా ఆవిష్కరించారని’ అన్నారు.

మరో వక్త డా. వాడ్రేవు వీరలక్ష్మిదేవి ‘మానవ సంబంధాలను ఆమె చూపినంత హృద్యంగా మరెవరూ చూపించలేరని’ అన్నారు. ఎమెస్కో విజయ కుమార్ ‘ఆమె వల్లే తమ సంస్థ నేటికీ సజీవంగా ఉంద’న్నారు.

మరో రచయిత్రి జి.లలిత ఆమె రచనలు పదిహేడు సినిమాలుగా వచ్చాయనీ, వాటిల్లో నిజాయితీ, స్వచ్ఛత ఆమె వ్యక్తిత్వాన్ని తెలియచేశాయన్నారు.

మరో రచయిత్రి,కవయిత్రి అల్లూరి గౌరీలక్ష్మి మాట్లాడుతూ సులోచనారాణి స్త్రీ పాత్రల ద్వారా వారి ఆత్మాభిమానాన్ని చక్కగా వ్యక్తీకరించారని, ఇంకా ఆమె నవలల్లో అన్ని వాదాలూ అంతర్లీనంగా ఉంటాయనీ ప్రత్యేకంగా కనబడవనీ అన్నారు. ఆవిడ భేషజాలు లేని మనిషి అనీ, అందరితో ప్రేమగా ఉండేవారనీ అన్నారు.

First Published:  4 Jan 2019 7:50 AM IST
Next Story