20 ఏళ్ల తర్వాత సముద్రంలో తిరిగే షిప్‌లన్నీ ఇలాంటివే...
టెక్నాలజీ మనిషి పనిని మరింత సులువు చేస్తోంది. అద్బుతాలను సృష్టిస్తోంది. సముద్ర రవాణా వ్యవస్థలోనూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోల్స్ రాయిస్ కంపెనీ మానవ సాయం లేకుండా షిప్‌లను విజయవంతంగా అభివృద్ది చేస్తోంది. ఇప్పటికే ఇలాంటి షిప్‌లు పిన్‌లాండ్ జలరవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ షిప్‌లు కెప్టెన్ లేకుండానే… నడిపేందుకు మనుషులు లేకుండానే ప్రయాణం చేయగలవు. సముద్ర తీరం నుంచే వీటిని నియంత్రించవచ్చు. షిప్ సిబ్బంది రోజుల తరబడి సముద్రంలో ప్రయాణం చేయాల్సిన […]
టెక్నాలజీ మనిషి పనిని మరింత సులువు చేస్తోంది. అద్బుతాలను సృష్టిస్తోంది. సముద్ర రవాణా వ్యవస్థలోనూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోల్స్ రాయిస్ కంపెనీ మానవ సాయం లేకుండా షిప్‌లను విజయవంతంగా అభివృద్ది చేస్తోంది. ఇప్పటికే ఇలాంటి షిప్‌లు పిన్‌లాండ్ జలరవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ షిప్‌లు కెప్టెన్ లేకుండానే… నడిపేందుకు మనుషులు లేకుండానే ప్రయాణం చేయగలవు. సముద్ర తీరం నుంచే వీటిని నియంత్రించవచ్చు. షిప్ సిబ్బంది రోజుల తరబడి సముద్రంలో ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఈ షిప్‌లకు సెన్సార్లు, కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటాయి. ఆటో నావిగేట్ ద్వారా ఇవి ప్రయాణిస్తుంటాయి. ఏదైనా వస్తువు గానీ, మరో స్టీమర్ గానీ ఎదురు వస్తే వెంటనే సెన్సార్ల ద్వారా ఆ విషయాన్ని పసిగడుతాయి. ఎదురైన వస్తువు ప్రమాదకరమైనదా… కాదా అన్నది వెంటనే నిర్ధారిస్తాయి.
ఎదురైన వస్తువు ప్రయాణానికి ఇబ్బంది కలిగించేది అయితే వెంటనే పక్కగా షిప్ వెళ్లిపోతుంది. షిప్ ప్రయాణంలో ఏదైనా ఇబ్బంది వస్తే తీరం బయట ఉన్న కంట్రోల్ రూం నుంచి ఆపరేట్ చేస్తారు. సముద్ర ప్రయాణంలో దొంగల బెడద కూడా అధికంగా ఉంటుంది. అలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఈ షిప్‌లోకి దొంగలు ప్రవేశించడం అంత ఈజీ కాదు. ఒకవేళ బలవంతంగా లోనికి వెళ్లినా వారు షిప్‌ను దారి మళ్లించే పరిస్థితి ఉండదు. తీరం బయట ఉన్న కంట్రోల్ రూం నుంచే షిప్‌ను నడిపిస్తారు.
ఒకవేళ షిప్ ముందుకు కదలకుండా యంత్రాలను నాశనం చేసినా … దొంగలైతే షిప్‌ను తమకు కావాల్సిన చోటుకి దారి మళ్లించే అవకాశం మాత్రం అసాధ్యం. మరో 20 ఏళ్ల తర్వాత సముద్రంలో దాదాపు అన్ని షిప్‌లు ఇదే టెక్నాలజీతో నడుస్తాయని రోల్స్ రాయిల్స్ కంపెనీ ధీమాగా చెబుతోంది.