Telugu Global
Cinema & Entertainment

సగానికి పడిపోయిన 'పేట' మార్కెట్

కొన్నేళ్లుగా రజనీకాంత్ మార్కెట్ టాలీవుడ్ లో పడిపోతూ వస్తోంది. రీసెంట్ గా 2.O సినిమాకు భారీ హైప్ ఇచ్చి, అటుఇటుగా 42 కోట్ల రూపాయలకు తెలుగు రైట్స్ అమ్మినప్పటికీ బయ్యర్లకు నష్టాలే మిగిలాయి. దీంతో తెలుగు నుంచి రజనీకాంత్ సినిమాలు కొనేందుకు ఎవ్వరూ ముందుకురాలేదు. దీంతో పేట సినిమా ఆఖరి నిమిషం వరకు అమ్ముడుపోలేదు. ఎట్టకేలకు వల్లభనేని అశోక్, పేట సినిమా రైట్స్ దక్కించుకున్నాడు. ఇప్పటికే సర్కార్, నవాబ్ లాంటి సినిమాలు పంపిణీ చేసిన అనుభవం ఉన్న […]

సగానికి పడిపోయిన పేట మార్కెట్
X

కొన్నేళ్లుగా రజనీకాంత్ మార్కెట్ టాలీవుడ్ లో పడిపోతూ వస్తోంది. రీసెంట్ గా 2.O సినిమాకు భారీ హైప్ ఇచ్చి, అటుఇటుగా 42 కోట్ల రూపాయలకు తెలుగు రైట్స్ అమ్మినప్పటికీ బయ్యర్లకు నష్టాలే మిగిలాయి. దీంతో తెలుగు నుంచి రజనీకాంత్ సినిమాలు కొనేందుకు ఎవ్వరూ ముందుకురాలేదు. దీంతో పేట సినిమా ఆఖరి నిమిషం వరకు అమ్ముడుపోలేదు.

ఎట్టకేలకు వల్లభనేని అశోక్, పేట సినిమా రైట్స్ దక్కించుకున్నాడు. ఇప్పటికే సర్కార్, నవాబ్ లాంటి సినిమాలు పంపిణీ చేసిన అనుభవం ఉన్న ఈ నిర్మాత, పేట రైట్స్ ను 21 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు. రజనీకాంత్ కు ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మార్కెట్ దృష్ట్యా చూసుకుంటే ఇది కాస్త రీజనబుల్ ఎమౌంట్ అనుకోవాలి.

కానీ సంక్రాంతి సీజన్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ రేటు కూడా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే 3 భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ లాక్ అయ్యాయి. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ బయోపిక్, ఎఫ్-2 సినిమాల్ని కాదని పేటకు థియేటర్లు కేటాయించే అవకాశం లేదు. అయినప్పటికీ దొరికిన థియేటర్లనే సర్దుకొని పేటను రిలీజ్ చేస్తున్నారు.

First Published:  4 Jan 2019 4:36 AM IST
Next Story