Telugu Global
NEWS

ఆ టిక్కెట్ మాదే అంటున్న ఎస్పీవై రెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ టీడీపీ టికెట్ విషయంలో ఎస్వీ మోహన్‌ రెడ్డి, టీజీ భరత్ మధ్య పోరు నడుస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి నంద్యాల అసెంబ్లీ స్థానం కూడా చేరింది. నంద్యాల నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఇదే స్థానాన్ని ఎస్పీవై రెడ్డి కుటుంబం కూడా ఆశిస్తోంది. ఇంతకాలం తెరవెనుక ప్రయత్నాలు చేసుకున్నారు. ఇప్పుడు బహిరంగంగానే టికెట్ తమదేనని ఎస్పీవై […]

ఆ టిక్కెట్ మాదే అంటున్న ఎస్పీవై రెడ్డి
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ టీడీపీ టికెట్ విషయంలో ఎస్వీ మోహన్‌ రెడ్డి, టీజీ భరత్ మధ్య పోరు నడుస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి నంద్యాల అసెంబ్లీ స్థానం కూడా చేరింది.

నంద్యాల నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఇదే స్థానాన్ని ఎస్పీవై రెడ్డి కుటుంబం కూడా ఆశిస్తోంది. ఇంతకాలం తెరవెనుక ప్రయత్నాలు చేసుకున్నారు. ఇప్పుడు బహిరంగంగానే టికెట్ తమదేనని ఎస్పీవై రెడ్డి ప్రకటించారు.

నంద్యాలలో అల్లుడు శ్రీధర్‌ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఎస్పీవై రెడ్డి… వచ్చే ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్‌కు టీడీపీ తరపున తిరిగి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి కూడా తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని వెల్లడించారు. చంద్రబాబు సర్వే చేయిస్తారని… ఆ సర్వేలో తమ పేరు ముందుంటుందని… కాబట్టి నంద్యాల అసెంబ్లీ స్థానానికి తన కుటుంబసభ్యులే పోటీ చేస్తారని స్పష్టం చేశారు ఎస్పీవై రెడ్డి.

ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌ రెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి తామే టీడీపీ తరపున పోటీ చేయబోతున్నామని మీడియా సమక్షంలోనే చెప్పారు. కొన్ని నెలల క్రితమే తాము ఫిక్స్ అయిపోయామన్నారు. టికెట్ రాదు అన్న అనుమానమే అక్కర్లేదని…ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని శ్రీధర్‌ రెడ్డి చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ టికెట్‌ను ఎస్పీవై రెడ్డి కుటుంబమే కాకుండా… మంత్రి ఫరూక్‌ కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు ఎస్పీవై రెడ్డి, ఆయన అల్లుడు ఒక అడుగు ముందుకేసి నంద్యాల అసెంబ్లీ టికెట్ తమదేనని ప్రకటించిన నేపథ్యంలో ఫరూక్‌, భూమా బ్రహ్మానందరెడ్డి ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశమైంది.

First Published:  4 Jan 2019 6:02 AM GMT
Next Story