రిషభ్ పంత్ దెబ్బతో ధోనీ రికార్డు తెరమరుగు
సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ సునామీ సెంచరీ కంగారూ గడ్డపై శతకం బాదిన భారత తొలివికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్…కంగారూ గడ్డపై సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరిటెస్టు రెండోరోజు ఆటలో రిషభ్ పంత్ మెరుపు సెంచరీతో చెలరేగిపోయాడు. 12 ఏళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ… విదేశీ గడ్డపై సాధించిన అత్యధిక పరుగుల రికార్డును రిషభ్ పంత్ తెరమరుగు చేశాడు. 2006 […]
- సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ సునామీ సెంచరీ
- కంగారూ గడ్డపై శతకం బాదిన భారత తొలివికెట్ కీపర్ బ్యాట్స్ మన్
టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్…కంగారూ గడ్డపై సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరిటెస్టు రెండోరోజు ఆటలో రిషభ్ పంత్ మెరుపు సెంచరీతో చెలరేగిపోయాడు.
12 ఏళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ… విదేశీ గడ్డపై సాధించిన అత్యధిక పరుగుల రికార్డును రిషభ్ పంత్ తెరమరుగు చేశాడు. 2006 సిరీస్ లో భాగంగా ఫైసలాబాద్ వేదికగా ముగిసిన టెస్టులో అప్పటి భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏకంగా 148 పరుగుల స్కోరు సాధించాడు.
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలసి 7వ వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడంలో పంత్ ప్రధానపాత్ర వహించాడు.
పంత్ ధనాధన్ బ్యాటింగ్…
ఇప్పుడు ఆ రికార్డును ఆస్ట్రేలియా గడ్డపై 159 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా రిషభ్ పంత్ అధిగమించాడు. పంత్ మొత్తం 189 బాల్స్ ఎదుర్కొని 15 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో తన కెరియర్ లోనే అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు.
9 టెస్టులు…2 సెంచరీలు
21 సంవత్సరాల రిషభ్ పంత్ తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన తొమ్మిది టెస్టు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 700కు పైగా పరుగులు సాధించడం విశేషం.