Telugu Global
National

మూడు వారాలుగా బొగ్గుగనిలో బాల కార్మికులు... థాయ్‌లాండ్‌లా ఎందుకు చేయడం లేదు?

మేఘాలయాలోని బొగ్గు గనిలో బాల కార్మికులు చిక్కుకుని మూడు వారాలు దాటి పోయింది. కానీ వారిని ఇప్పటికీ రెస్క్యూ సిబ్బంది రక్షించలేకపోతున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, మేఘాలయ ప్రభుత్వ సిబ్బంది ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈనేపథ్యంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాలుగా గనిలో బాల కార్మికులు చిక్కుకుని ఉంటే… ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అన్ని […]

మూడు వారాలుగా బొగ్గుగనిలో బాల కార్మికులు... థాయ్‌లాండ్‌లా ఎందుకు చేయడం లేదు?
X

మేఘాలయాలోని బొగ్గు గనిలో బాల కార్మికులు చిక్కుకుని మూడు వారాలు దాటి పోయింది. కానీ వారిని ఇప్పటికీ రెస్క్యూ సిబ్బంది రక్షించలేకపోతున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, మేఘాలయ ప్రభుత్వ సిబ్బంది ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు.

ఈనేపథ్యంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాలుగా గనిలో బాల కార్మికులు చిక్కుకుని ఉంటే… ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని… మేఘాలయ ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనను కోర్టు అంగీకరించలేదు.

మూడు వారాలుగా గనిలో చిక్కుకున్నా…. రక్షించలేని ప్రయత్నం కూడా ఒక ప్రయత్నమేనా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆదేశించింది.

జీవన్మరణ సమస్యను ముందు పెట్టుకుని ఇంత నిర్లక్ష్యం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. గనిలోని వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే బయటకు తీసుకురావాల్సిందేనని ఆదేశించింది.

కొన్ని నెలల క్రితం థాయ్‌లాండ్‌లో ఇదే తరహాలో విద్యార్థులు చిక్కుకుపోగా వారిని అక్కడి ప్రభుత్వం సమర్ధవంతంగా రక్షించింది. ఈ విషయం కూడా కోర్టులో ప్రస్తావనకు వచ్చింది.

థాయ్‌లాండ్ ప్రభుత్వానికి కిర్లోస్కర్ కంపెనీ పెద్దపెద్ద మోటార్లను అందించి సాయపడిందని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ఇక్కడ మాత్రం సహాయ సిబ్బంది ఈత కొట్టుకుంటూ లోనికి వెళ్లే పరిస్థితి కూడా లేదని కోర్టు దృష్టికి తెచ్చారు.

దీంతో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు మరి అలాంటి పెద్ద మోటర్లను ఇక్కడ ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నించింది. మన దేశంలో మోటార్లే లేవా అని నిలదీసింది. నిర్లక్ష్యం వీడి వెంటనే అవసరమైతే సైన్యం సాయం తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.

గతేడాది డిసెంబర్‌ 13న జైంతియా హిల్స్ జిల్లాలోని చిన్నపాటి బొగ్గు గనిలోకి 15 మంది బాల కార్మికులు వెళ్లారు. అదే సమయంలో పక్కనే ఉన్న లైతిన్‌ నది పొంగడంతో వారు లోపలే చిక్కుకుపోయారు. వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అన్నది కూడా తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో వారు ఎలా ఉన్నా సరే బయటకు తీసుకురావాలని హైకోర్టు ఆదేశించింది.

First Published:  3 Jan 2019 9:12 PM GMT
Next Story