Telugu Global
NEWS

ఇది కోడి కత్తా?... నారా కత్తా? ఇప్పుడు తేలుతుంది....

జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు హైకోర్టు అప్పగించడం పట్ల వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిదన్నారు. దాడి జరిగిన వెంటనే ఘటన ఎయిర్‌పోర్టులో జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చంద్రబాబు, డీజీపీ చెప్పారన్నారు. కానీ కేసును మాత్రం ఎన్‌ఐఏ చేతికి వెళ్లకుండా సొంతంగా దర్యాప్తు చేశారని చెప్పారు. కేసును హైకోర్టు ఎన్‌ఐఏకు అప్పగించిన నేపథ్యంలో ఇది కోడికత్తి దాడినా?… లేక నారా వారి […]

ఇది కోడి కత్తా?... నారా కత్తా? ఇప్పుడు తేలుతుంది....
X

జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు హైకోర్టు అప్పగించడం పట్ల వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిదన్నారు.

దాడి జరిగిన వెంటనే ఘటన ఎయిర్‌పోర్టులో జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చంద్రబాబు, డీజీపీ చెప్పారన్నారు. కానీ కేసును మాత్రం ఎన్‌ఐఏ చేతికి వెళ్లకుండా సొంతంగా దర్యాప్తు చేశారని చెప్పారు.

కేసును హైకోర్టు ఎన్‌ఐఏకు అప్పగించిన నేపథ్యంలో ఇది కోడికత్తి దాడినా?… లేక నారా వారి కత్తి దాడినా? అన్నది ఇప్పుడు తేలుతుందన్నారు. ముమ్మాటికీ జగన్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర జరిగిందన్నారు.

ఘటన జరిగిన అరగంటలోనే, నిందితుడు శ్రీనివాస రావును ఏపీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోకముందే డీజీపీ మీడియా ముందుకు వచ్చిన ఇది అభిమాని దాడి అని ప్రకటించిన తర్వాత ఏపీ ప్రభుత్వ పరిధిలో విచారణ జరిగితే నిజాలు బయటకు రావన్నారు.

దాడి జరిగిన వెంటనే టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి ఇది సానుభూతికోసం జగనే తనపైన చేయించుకున్న హత్యాయత్నం అని మాట్లాడారు. మీడియా కూడా ఈ విషయం మీద బాగా ఫోకస్ చేసింది.

శ్రీనివాస రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు అతని జేబులో లెటర్ ఉన్నట్లు చెప్పలేదన్నారు. తరువాత కనీసం మడతలు కూడా పడని లెటర్ ను సృష్టించారన్నారు.

చంద్రబాబు స్పందన నుంచి… శ్రీనివాస్ వద్ద దొరికిందంటున్న లేఖ వరకు అన్ని అనుమానంగానే ఉన్నాయన్నారు. కేసును ఎన్‌ఐఏకు అప్పగించిన నేపథ్యంలో సమాధానాలు చెప్పేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు.

ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కూడా అధికారిక ప్రెస్ మీట్లలో కూడా అబద్ధాలు చెబుతున్నాడని…. జగన్ హత్యాయత్నం నుంచి తప్పించుకుని హైదరాబాద్ చేరుకున్నాక అన్ని వేల మంది అభిమానులు, పోలీసులు మధ్య నేరుగా ఎయిర్ పోర్ట్ నుంచి ఆసుపత్రికి వెళితే చంద్రబాబు మాత్రం జగన్ ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్ళిపోయాడని…. రెస్టు తీసుకున్నాక కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో ఆసుపత్రిలో చేరాడని మీడియా ముందు చెప్పాడు. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రులు ఉండరని అన్నారు.

దాడి జరిగినప్పటి నుంచి చంద్రబాబు కోడి కత్తి దాడి అంటూ హేళన చేస్తున్నారని…. కానీ దాడి చేసింది నారా వారి కత్తే అన్నది ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలుతుందన్నారు మిథున్ రెడ్డి.

First Published:  4 Jan 2019 7:48 AM IST
Next Story