జనసేనలోకి వలసలను ఆపడంలో బాబు సక్సెస్?!
జనసేన మీద పొత్తు అనుమానాలను రేపడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. తాము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోమని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పుకున్నాడు. అయితే పవన్ పార్టీ పై అనుమానాలను రేకెత్తించడంలో మాత్రం చంద్రబాబు నాయుడు సఫలం అయ్యాడు. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండవచ్చనే ఊహాగానాలను చంద్రబాబు నాయుడు రేపాడు. తద్వారా ఆ పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్న తెలుగుదేశం లీడర్లకు చంద్రబాబు నాయుడు బ్రేక్ వేశాడు. వచ్చే ఎన్నికల్లో తాము సొంతంగా గెలవలేము […]
జనసేన మీద పొత్తు అనుమానాలను రేపడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. తాము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోమని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పుకున్నాడు. అయితే పవన్ పార్టీ పై అనుమానాలను రేకెత్తించడంలో మాత్రం చంద్రబాబు నాయుడు సఫలం అయ్యాడు.
జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండవచ్చనే ఊహాగానాలను చంద్రబాబు నాయుడు రేపాడు. తద్వారా ఆ పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్న తెలుగుదేశం లీడర్లకు చంద్రబాబు నాయుడు బ్రేక్ వేశాడు.
వచ్చే ఎన్నికల్లో తాము సొంతంగా గెలవలేము అని చంద్రబాబుకు స్పష్టంగా అర్థం అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన పొత్తుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశాడు.
మరోవైపు ఎలాగూ పార్టీ గెలవదనే ఉద్దేశంతో చాలా మంది నేతలు టీడీపీని వదిలేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో…. చంద్రబాబు నాయుడు పార్టీలోని నేతలను నిలపడానికి జనసేనతో పొత్తు అనే అంశాన్ని తెరపైకి తెచ్చాడు.
జనసేనతో టీడీపీ పొత్తు ఉండవచ్చని అన్నాడు. రెండో రోజు మరో అడుగు ముందుకు వేసి.. జనసేన తమతో పొత్తుకు రావాలని చంద్రబాబు నాయుడు ఆహ్వానించాడు. తద్వారా జనసేనలోకి వెళ్లాలి అనుకునే వాళ్లకు చంద్రబాబు బ్రేకులు వేశాడు.
జనసేన సొంతంగా పోటీ చేస్తుంది…. అంటే ఆ పార్టీలోకి వెళ్లడానికి ఉత్సాహం చూపించే వాళ్లకూ, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని జనసేన బరిలోకి దిగుతుందంటే.. చేరే వాళ్లకూ చాలా తేడా ఉంటుంది. తెలుగుదేశంతో జనసేన పొత్తుపెట్టుకుంటే ఆ పార్టీకి దక్కేదే పదో, పదిహేను సీట్లలో పోటీకి అవకాశం. అలాంటి నేపథ్యంలో తమకు టికెట్ దక్కుతుందో లేదో అని చాలా మంది అనుమానాల్లో పడతారు. జనసేనలోకి వెళ్లే సాహసం చేయరు అలాంటి వాళ్లు.
అందుకోసమే బాబు.. జనసేనతో పొత్తు అనే లీకులను ఇచ్చి.. కొత్త రాజకీయం మొదలుపెట్టాడని.. పవన్ నష్ట నివారణ చర్యలకు దిగాడని స్పష్టం అవుతోంది.