Telugu Global
NEWS

చంద్రబాబు పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించింది అందుకే....

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఏటా దావోస్ వెళ్తుంటారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనే విషయంలో తొలి నుంచి ఆసక్తి చూపుతూ వస్తున్నారు. ఏటా ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్తున్న చంద్రబాబుకు… ఈసారి కేంద్రం నుంచి ఊహించని స్పందన ఎదురైంది. భారత దేశం నుంచి దావోస్‌ వెళ్ళేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని ఏపీ ప్రభుత్వం కోరింది. గతంలో చంద్రబాబు ప్రత్యేక విమానంలో భారీగా సహచరులు, అధికారులను వెంటపెట్టుకుని వెళ్లేవారు. ఈసారి మాత్రం భారీ సంఖ్యలో బృందం వెళ్లడానికి […]

చంద్రబాబు పర్యటనపై  కేంద్రం ఆంక్షలు  విధించింది అందుకే....
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఏటా దావోస్ వెళ్తుంటారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనే విషయంలో తొలి నుంచి ఆసక్తి చూపుతూ వస్తున్నారు. ఏటా ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్తున్న చంద్రబాబుకు… ఈసారి కేంద్రం నుంచి ఊహించని స్పందన ఎదురైంది.

భారత దేశం నుంచి దావోస్‌ వెళ్ళేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని ఏపీ ప్రభుత్వం కోరింది. గతంలో చంద్రబాబు ప్రత్యేక విమానంలో భారీగా సహచరులు, అధికారులను వెంటపెట్టుకుని వెళ్లేవారు. ఈసారి మాత్రం భారీ సంఖ్యలో బృందం వెళ్లడానికి కేంద్రం అంగీకరించలేదు. పర్యటనను వారం రోజులు కాకుండా నాలుగు రోజుల్లోనే ముగించుకోవాలని స్పష్టం చేసింది.

చంద్రబాబు వెంట మొత్తం 14 మంది వెళ్తారని కేంద్రానికి ఏపి ప్రభుత్వం తెలియజేసింది. అయితే అంతమంది వెళ్లి వారం పాటు దుబారా చేయడం సరికాదని భావించిన కేంద్రం…. చంద్రబాబు వెంట నలుగురు వెళ్లేందుకు మాత్రమే అంగీకరించింది. పర్యటనను నాలుగు రోజుల్లో ముగించుకుని రావాల్సిందిగా తేల్చిచెప్పింది.

చంద్రబాబు, నారా లోకేష్, యనమల రామకృష్ణుడు ఇతరులతో కూడిన భారీ బృందం దావోస్ వెళ్లాలని భావించింది. ఇందు కోసం కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేయగా…. పర్యటనకు అనుమతి ఇస్తూనే దుబారా తగ్గింపు కోసం ఆంక్షలు విధించింది.

చంద్రబాబుతో పాటు కేవలం నలుగురికే కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా చంద్రబాబు నలుగురి కోసం ప్రత్యేక విమానంలో వెళ్తారా లేక సాధారణ విమానాల్లోనే దావోస్ వెళ్తారా అన్నది కూడా చర్చనీయాంశమైంది. ఈనెల 20 నుంచి చంద్రబాబు దావోస్ పర్యటన మొదలవుతుంది.

కేంద్రం ఇలా ప్రవర్తించడానికి కారణం ఉందంటున్నారు బీజేపీ నాయకులు. ప్రపంచ ఆర్ధిక సదస్సుకు రమ్మని ఏనాడూ చంద్రబాబుకు ఆహ్వానం లేదని…. అయితే చంద్రబాబు సొంత ఖర్చులతో వెళ్ళి…. సదస్సుకు ఆహ్వానం టిక్కెట్లు కొనుక్కొని ఒక శ్రోత లాగా సదస్సులో పాల్గొని…. ఆ తరువాత తాను బసచేసిన హోటల్ కు కొంతమంది విదేశీయులను విందులకు ఆహ్వానించి ఆ ఫొటోలకు ఎల్లో మీడియాలో విశేష ప్రచారం కల్పించి…. చంద్రబాబు ఆర్ధిక సదస్సులో మాట్లాడినట్లుగా ఇన్నేళ్ళుగా కలరింగ్ ఇస్తూ వస్తున్నారని…. ఇప్పటి వరకు ఒక్క ఏడాది కూడా చంద్రబాబుకు ఆహ్వానం లేదని…. అయినా ప్రజలను మభ్యపెట్టడానికి…. తానో ప్రపంచ నాయకుడినని మీడియాలో ఊదరగొట్టడానికే ఇలాంటి సదస్సులకు ప్రజల డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టి పోతుంటాడని….. అలాంటి దుబారాను ఆపడానికే కేంద్రం ఆంక్షలు విధించిందని బీజేపీ నాయకులు అంటున్నారు.

First Published:  4 Jan 2019 5:13 AM
Next Story