జగన్ ఆస్తుల కేసులో కొత్త ట్విస్ట్.... న్యాయమూర్తి బదిలీ
జగన్ ఆస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసును విచారిస్తున్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు. ఇకపై కొత్తగా వచ్చే న్యాయమూర్తి కేసును విచారించనున్నారు. ప్రతి వారం కేసు విచారణ జరుగుతోంది. న్యాయమూర్తి బదిలీ నేపథ్యంలో కేసు విచారణ ఈనెల 25కు వాయిదా పడింది. ఇప్పటికే చాలా వరకు వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి బదిలీ నేపథ్యంలో కొత్తగా వచ్చే న్యాయమూర్తి వాదనలను తొలి నుంచి వింటారా లేక బదిలీ […]

జగన్ ఆస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసును విచారిస్తున్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు. ఇకపై కొత్తగా వచ్చే న్యాయమూర్తి కేసును విచారించనున్నారు. ప్రతి వారం కేసు విచారణ జరుగుతోంది.
న్యాయమూర్తి బదిలీ నేపథ్యంలో కేసు విచారణ ఈనెల 25కు వాయిదా పడింది. ఇప్పటికే చాలా వరకు వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి బదిలీ నేపథ్యంలో కొత్తగా వచ్చే న్యాయమూర్తి వాదనలను తొలి నుంచి వింటారా లేక బదిలీ అయిన న్యాయమూర్తి ఇచ్చిన వివరాల ఆధారంగా ముందుకు వెళ్తారా అన్నది చూడాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
విచారణకు నేడు కోర్టుకు వచ్చిన జగన్… న్యాయమూర్తి లేకపోవడంతో కోర్టు సిబ్బంది సూచన మేరకు వెనుదిరిగి వెళ్లిపోయారు.