నాలుగో అంతస్తు నుంచి కింద పడిన చిన్నారి.... కాపాడిన చెట్టు
ముంబైలోని గోవండి ప్రాంతంలోని గోపికృష్ణ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి 14 నెలల వయసు ఉన్న అథర్వ భర్కాడే అనే చిన్నారి జారి పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ ఆ భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడటంతో తీవ్ర గాయాలతో మృత్యు ఒడి నుంచి బయటపడ్డాడు. ఒక వేళ ఆ చెట్టే అక్కడ లేకుంటే ఏం జరిగేదో ఊహించడమే కష్టంగా ఉండేది. ముంబైకి చెందిన అజిత్ భర్కడే తన భార్య, తల్లి, కుమారుడితో ఒక అపార్టుమెంట్‌లోని నాలుగో అంతస్తులో […]
ముంబైలోని గోవండి ప్రాంతంలోని గోపికృష్ణ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి 14 నెలల వయసు ఉన్న అథర్వ భర్కాడే అనే చిన్నారి జారి పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ ఆ భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడటంతో తీవ్ర గాయాలతో మృత్యు ఒడి నుంచి బయటపడ్డాడు. ఒక వేళ ఆ చెట్టే అక్కడ లేకుంటే ఏం జరిగేదో ఊహించడమే కష్టంగా ఉండేది.
ముంబైకి చెందిన అజిత్ భర్కడే తన భార్య, తల్లి, కుమారుడితో ఒక అపార్టుమెంట్‌లోని నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. వారి ఫ్లాట్‌లోని కిటికీని తెరిచి ఉంచడంతో అక్కడకు ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి… పొరపాటున కిటికీ నుంచి జారి పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ చిన్నారి నానమ్మ కేకలు వేసింది. వెంటనే చిన్నారి తండ్రి కిందకు వెళ్లి…. చెట్టులో నుంచి జారుకుంటూ కిందపడిన అతడిని ఆసుపత్రికి తరలించాడు.
ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి మెరుగు పడిందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారి పాదం, ఒంటిపై గాయాలతో పాటు లివర్ కూడా కొద్దిగా దెబ్బతిన్నదని.. దానికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. చెట్టు ఉండటం వల్లే తక్కువ గాయాలతో బయటపడ్డాడని వారు చెప్పారు.
ఏదేమైనా అపార్ట్‌మెంట్స్‌లో ఉండే వాళ్లు చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. వారిని గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ ఉదంతం సూచిస్తోంది.