Telugu Global
NEWS

తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న చివరి పిటీషన్‌ను కూడా ఇవాళ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించే అవకాశం కలిగింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడి.. నిర్వహణా ప్రక్రియ ఊపందుకున్న దశలో ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్సును జారీ చేసింది. సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని […]

తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X

తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న చివరి పిటీషన్‌ను కూడా ఇవాళ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించే అవకాశం కలిగింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడి.. నిర్వహణా ప్రక్రియ ఊపందుకున్న దశలో ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.

బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్సును జారీ చేసింది. సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని తీర్పు నిచ్చిన నేపథ్యంలో…. జనవరిలోపు ఎన్నికలు నిర్వహించాలనే ఆదేశాల మేరకు పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తోంది.

అయితే బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రిజర్వేషన్ల తగ్గింపు అన్యాయమని…. వెంటనే ఎన్నికల ప్రక్రియను ఆపు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ వెంటనే ఆపు చేయాలని కోరారు.

కాగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడిన పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే రిజర్వేషన్ల విషయమై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

First Published:  3 Jan 2019 5:03 AM GMT
Next Story