Telugu Global
NEWS

పాపం! శ్రీలంక, బంగ్లాదేశ్

2020 టీ-20 ప్రపంచకప్ కు నేరుగా అర్హత లేని అగ్రశ్రేణి జట్లు క్వాలిఫైయింగ్ రౌండ్లలో ఇక శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల పోటీ ఆసియా అగ్రశ్రేణి క్రికెట్ జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్ ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇంతబతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు అప్ఘనిస్థాన్ లాంటి పసికూన జట్టు… ఓవైపు నేరుగా అర్హత సాధిస్తే… అపార అనుభవం ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు మాత్రం విఫలమయ్యాయి. ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో […]

పాపం! శ్రీలంక, బంగ్లాదేశ్
X
  • 2020 టీ-20 ప్రపంచకప్ కు నేరుగా అర్హత లేని అగ్రశ్రేణి జట్లు
  • క్వాలిఫైయింగ్ రౌండ్లలో ఇక శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల పోటీ

ఆసియా అగ్రశ్రేణి క్రికెట్ జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్ ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇంతబతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు అప్ఘనిస్థాన్ లాంటి పసికూన జట్టు… ఓవైపు నేరుగా అర్హత సాధిస్తే… అపార అనుభవం ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు మాత్రం విఫలమయ్యాయి.

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో మొదటి ఆరుస్థానాలకు…ర్యాంకుల ప్రాతిపదికన పాకిస్థాన్, టీమిండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అప్ఘనిస్థాన్ జట్లు నేరుగా అర్హత సాధించాయి.

మిగిలిన ఆరు బెర్త్ ల భర్తీ కోసం జరిగే క్వాలిఫైయింగ్ రౌండ్లలో మూడుసార్లు ప్రపంచకప్ రన్నరప్ శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు..మరో పదిజట్లతో కలసి పోటీపడాల్సి ఉంది.

ఆస్ట్రేలియా వేదికగా 2020 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకూ టీ-20 ప్రపంచకప్ టోర్నీని నిర్వహించనున్నారు.

First Published:  3 Jan 2019 2:58 AM IST
Next Story