మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు కేటీఆర్ !
సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ కలిశారు. తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకాశ్ రాజ్ ప్రకటించిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి భేటీ సందర్భంగా దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. “నా రాజకీయ ప్రయాణానికి స్పూర్తిదాయక మద్దతు ఇచ్చినందుకు కేటీఆర్ కు ధన్యవాదాలు. ఈ సరికొత్త ప్రయాణం కొందరి మీద పోరాటానికి కాదు… సమాజం కోసం #justasking ఉద్యమాన్ని పార్లమెంటులోనూ కొనసాగిస్తా’’ అంటూ ప్రకాశ్ […]
సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ కలిశారు. తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకాశ్ రాజ్ ప్రకటించిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి భేటీ సందర్భంగా దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.
“నా రాజకీయ ప్రయాణానికి స్పూర్తిదాయక మద్దతు ఇచ్చినందుకు కేటీఆర్ కు ధన్యవాదాలు. ఈ సరికొత్త ప్రయాణం కొందరి మీద పోరాటానికి కాదు… సమాజం కోసం #justasking ఉద్యమాన్ని పార్లమెంటులోనూ కొనసాగిస్తా’’ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
Thank you @KTRTRS for the inspiring support to my political journey… a new beginning NOT AGAINST some one but FOR THE SOCIETY #citizensvoice #justasking in parliament too .. pic.twitter.com/dPkxjkCPE9
— Prakash Raj (@prakashraaj) January 2, 2019
ఈ కొత్త సంవత్సరం నుంచే అదనపు బాధ్యతలు తీసుకుంటాను. రానున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తాను. ప్రజల అండదండలు, ఆశీర్వాదంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి… ఇప్పుడు కొనసాగిస్తున్న #justasking ను పార్లమెంటులోనూ ఎలుగెత్తుతాను అంటూ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకాశ్‌రాజ్ వెల్లడించారు. ‘సిటిజన్‌వాయిస్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక దృక్పథాన్ని చాటుతున్న ప్రకాశ్ రాజ్…. తన ఆప్తులతో పోటీ విషయమై చర్చలు జరుపుతోన్నట్లు సమాచారం.
కర్ణాటకతో పాటు తెలంగాణ, తమిళనాడుల్లో గ్రామాలను దత్తత తీసుకున్న ఈ బహుభాషా నటుడు ఏ రాష్ట్రంలో పోటీ చేస్తారన్నది ఇంకా సస్పెన్స్ లో ఉంచారు. చలన చిత్రాల్లో సందడి చేస్తోన్న ప్రకాశ్‌రాజ్ గత ఏడాది ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య తర్వాత తన గళానికి పదును పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు.