సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలి
కోటి ఎకరాలకు సాగు నీరందించాలన్న తపనతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అధికారులు, వర్క్ ఏజెన్సీలు పనుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఎప్పటికప్పుడు నిర్మాణంపై సమీక్ష చేస్తామని చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు కాలువ పనుల్లో…. అధికారులకు, కాంట్రాక్టర్లకు సీఎం పలు సూచనలు చేశారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కేసీఆర్ మరోసారి ఆదేశించారు. ఫిబ్రవరి చివరి నాటికి అన్నారం బ్యారేజీ […]
కోటి ఎకరాలకు సాగు నీరందించాలన్న తపనతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అధికారులు, వర్క్ ఏజెన్సీలు పనుల్లో నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఎప్పటికప్పుడు నిర్మాణంపై సమీక్ష చేస్తామని చెప్పారు.
కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు కాలువ పనుల్లో…. అధికారులకు, కాంట్రాక్టర్లకు సీఎం పలు సూచనలు చేశారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కేసీఆర్ మరోసారి ఆదేశించారు.
ఫిబ్రవరి చివరి నాటికి అన్నారం బ్యారేజీ పనులు పూర్తిచేస్తామని, కేసీఆర్‌కు కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. సుందిళ్ళ బ్యారేజి పనులు మందకొడిగా సాగడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని పనులు పూర్తిచేసి ఏప్రిల్‌లో వెట్ రన్‌కు సిద్ధం కావాలని కేసీఆర్ సూచించారు.
శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకంలో భాగంగా రాజేశ్వర్‌రావు పేట వద్ద…. నిర్మాణంలోని రెండో పంప్‌హౌస్ పనులను కేసీఆర్ పరిశీలించారు. మొదటగా ఒకటి, రెండో పంప్‌హౌస్‌ల్లో మోటార్లను బిగించాలని ఆదేశించారు. “జూన్ నాటికి మూడో పంప్‌హౌస్ పనులు పూర్తిచేయాలి. ప్రాజెక్టులు పూర్తయ్యాక టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది. మల్టీ నేషనల్ కంపెనీలను టూరిజం అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం. రామగుండం నుంచి రైల్వేమార్గం కూడా పొడిగిస్తాం” అని కేసీఆర్ చెప్పారు.