ఫేస్‌బుక్ అంత నమ్మదగ్గ సంస్థ కాదు!
ఫేస్‌బుక్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ఓ సర్వే. ఫేస్‌బుక్ అంత నమ్మదగ్గ సంస్థ కాదని తేల్చి చెప్పింది. యూజర్ల సమాచారాన్ని ఫేస్‌బుక్ బయటి సంస్థలకు చేరవేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రీసెర్చ్ కంపెనీ టోలూనా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఫేస్‌బుక్ అంత నమ్మదగ్గ సంస్థ కాదని ఈ సర్వేలో పాల్గొన్న అత్యధికులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. వారిలో దాదాపు 40శాతం మంది ఫేస్‌బుక్ ను అంతగా నమ్మోద్దని తేల్చి చెప్పారు. ట్విట్టర్, […]
ఫేస్‌బుక్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ఓ సర్వే. ఫేస్‌బుక్ అంత నమ్మదగ్గ సంస్థ కాదని తేల్చి చెప్పింది. యూజర్ల సమాచారాన్ని ఫేస్‌బుక్ బయటి సంస్థలకు చేరవేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే రీసెర్చ్ కంపెనీ టోలూనా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఫేస్‌బుక్ అంత నమ్మదగ్గ సంస్థ కాదని ఈ సర్వేలో పాల్గొన్న అత్యధికులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. వారిలో దాదాపు 40శాతం మంది ఫేస్‌బుక్ ను అంతగా నమ్మోద్దని తేల్చి చెప్పారు.
ట్విట్టర్, అమెజాన్ లు కూడా నమ్మదగ్గ సంస్థలు కావని 8శాతం మంది చెప్పారు. యూబర్ 7శాతం, గూగుల్ కు 6శాతం మంది ఆ ముద్రను వేశారు. మైక్రోసాఫ్ట్, ఆపిల్ సంస్థల పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉన్నట్లు సర్వేలో తేలింది.
ఇక మైక్రోసాఫ్ట్ ను 4శాతం మంది, ఆపిల్ ను 2శాతం మంది మాత్రమే అంతగా నమ్మోద్దని చెప్పారు.
ఇక నెట్ ఫ్లిక్స్, టెస్లా కంపెనీలకు కేవలం 1శాతంతో…. నమ్మ దగ్గ కంపెనీల లిస్టులో అగ్రభాగాన నిలిచాయి.