Telugu Global
International

ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మాడు.... ఇప్పుడేమో!

ఐఫోన్…ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ కు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐఫోన్ చేతిలో ఉంటే అదో పెద్ద స్టేటస్ గా ఫీలవుతుంటారు. కానీ ఐఫోన్ సొంతం చేసుకోవడం…. అందరివల్లా కాదు. ఎందుకంటే దాని ధర మామూలుగా ఉండదు. ఐఫోన్ కోసం దొంగతనాలు…గొడవలు జరిగాయంటే..దానికున్న డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు…ఐఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యలు, ఇంట్లో నుంచి పారిపోవడం లాంటి ఘటనలు కూడా ఉన్నాయి. కానీ చైనాకు చెందిన ఓ యువకుడు ఐఫోన్ కోసం తన […]

ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మాడు.... ఇప్పుడేమో!
X

ఐఫోన్…ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ కు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐఫోన్ చేతిలో ఉంటే అదో పెద్ద స్టేటస్ గా ఫీలవుతుంటారు. కానీ ఐఫోన్ సొంతం చేసుకోవడం…. అందరివల్లా కాదు. ఎందుకంటే దాని ధర మామూలుగా ఉండదు. ఐఫోన్ కోసం దొంగతనాలు…గొడవలు జరిగాయంటే..దానికున్న డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు.

అంతేకాదు…ఐఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యలు, ఇంట్లో నుంచి పారిపోవడం లాంటి ఘటనలు కూడా ఉన్నాయి. కానీ చైనాకు చెందిన ఓ యువకుడు ఐఫోన్ కోసం తన ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. ఐఫోన్ సొంతం చేసుకోవాలని ఏకంగా తన కిడ్నీనే అమ్ముకున్నాడు. ఫలితంగా జీవితాంతం మంచానికే పరిమితం కావల్సిన దుస్థితి నెలకొంది.

చైనాకు చెందిన వాంగ్….తనకు ఎప్పటినుంచో ఐఫోన్ కొనుక్కోవాలని కలలు కంటున్నాడు. కానీ వాంగ్ ఆర్థిక పరిస్థితులు మాత్రం అంతంత మాత్రమే కావడంతో…తన కలను సాకారం చేసుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా తాను ఐఫోన్ కొనాలని ఏకంగా తన కిడ్నీని అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో ఐఫోన్ కొనుక్కున్నాడు. 3,200డాలర్లకు కిడ్నీని అమ్ముకుని… ఐఫోన్ కొన్నాడు. మిగిలిన డబ్బుతో జల్సాలు చేశాడు.

కానీ తన ప్లాన్ బెడిసి కొట్టింది. తాను చేయించుకున్న శస్త్రచికిత్స సక్సెస్ కాలేదు. దాంతో ఇన్ఫెక్షన్ సోకి ఉన్న కిడ్నీ కూడా పూర్తిగా పాడైపోయింది. బతికినంత కాలం డయాలసిస్ చేయించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాది కాలంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాంగ్‌కు డయాలసిస్ చేయిస్తున్నారు. మున్ముందు చేయించడానికి తమ దగ్గర డబ్బులు లేవని వాంగ్ తల్లిదండ్రులు వాపోయారు.

First Published:  2 Jan 2019 5:30 AM IST
Next Story