చంద్రబాబు దుర్యోధనుడి టైప్.... జనాన్ని చూసి గెలుస్తామనుకుంటే వైసీపీ పొరపాటే
చంద్రబాబును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ పాదయాత్రకు, జగన్ పాదయాత్రకు పోలిక లేదన్నారు. వైఎస్ పాదయాత్రకు రానురాను క్రేజ్ పెరుగుతూ వచ్చిందన్నారు. వైఎస్‌కు కాంగ్రెస్ లో చాలా మంది వ్యతిరేకులుండేవారన్నారు. ఏపీలో వైఎస్ చేసింది అదిపెద్ద తొలి పాదయాత్ర అని అన్నారు. చంద్రబాబు పాదయాత్ర మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని నిరూపించుకునేందుకు చేసిన పాదయాత్ర అని అభివర్ణించారు. పాదయాత్ర సమయంలో రాజమండ్రిలో చంద్రబాబు మీటింగ్ పెడితే 300 మంది కూడా […]
చంద్రబాబును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ పాదయాత్రకు, జగన్ పాదయాత్రకు పోలిక లేదన్నారు. వైఎస్ పాదయాత్రకు రానురాను క్రేజ్ పెరుగుతూ వచ్చిందన్నారు. వైఎస్‌కు కాంగ్రెస్ లో చాలా మంది వ్యతిరేకులుండేవారన్నారు. ఏపీలో వైఎస్ చేసింది అదిపెద్ద తొలి పాదయాత్ర అని అన్నారు.
చంద్రబాబు పాదయాత్ర మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని నిరూపించుకునేందుకు చేసిన పాదయాత్ర అని అభివర్ణించారు. పాదయాత్ర సమయంలో రాజమండ్రిలో చంద్రబాబు మీటింగ్ పెడితే 300 మంది కూడా రాలేదన్నారు. ఓడిపోతున్నాం అని తెలిసినా సరే ఆఖరి నిమిషం వరకు పట్టువదిలిపెట్టని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. పాదయాత్రకు జనం రాకపోయినా మొండిగా చంద్రబాబు తిరిగి విజయం సాధించారన్నారు.
జగన్‌కు వైఎస్ కుమారుడిగా జనంలో విపరీతమైన ఆదరణ ఉందన్నారు. వైఎస్ అనే వ్యక్తి పేద ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోగలిగారన్నారు. ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రల్లో జగన్‌కు వచ్చినంత ఆదరణ ఏ పాదయాత్రకు రాలేదన్నారు.
చంద్రబాబు దుర్వోధనుడి లాంటి వ్యక్తి…. ఆయన ఆఖరి వరకు దేన్నీ వదిలిపెట్టరు
చంద్రబాబు దుర్వోధనుడి లాంటి వ్యక్తి అని ఆఖరి వరకు దేన్నీ వదిలిపెట్టరన్నారు. కూలిపోయే సమయంలో కూడా దుర్యోధనుడు…. అశ్వత్ధామను తెరపైకి తెచ్చి పాండవుల సేనను తుక్కుతుక్కు చేయించారని… చంద్రబాబు కూడా అలాంటి వ్యక్తేనన్నారు. కాబట్టి చంద్రబాబును ఓడించాలంటే ఆఖరి నిమిషం వరకు జాగ్రత్తగా ఉండాల్సిందేనన్నారు. జనం వస్తున్నారు కాబట్టి జగన్ గెలిచేశాడు అనుకుంటే పొరపాటేనన్నారు.