Telugu Global
National

ఆ సైనికులు... స్నానానికి మూడునెలలు ఆగాల్సిన పనిలేదు!

సియాచిన్….ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న యుద్ధభూమి. ఇది భారత్, చైనా సరిహద్దు. సియాచిన్ లో ఉష్ణోగ్రతలు దాదాపు మైసన్ 60 డిగ్రీలకు పడిపోతుంటాయి. అలాంటి ప్రదేశంలో మన సైనికులు దేశ రక్షణ కోసం పహార కాస్తుంటారు. కోల్ కతా హెడ్ క్వార్టర్స్ గా ఉన్న ఈస్టర్న్ కమాండ్… సియాచిన్ రక్షణ బాధ్యతను చేపడుతుంది. ఇక్కడ రక్షణ కోసం రోజుకు దాదాపుగా 5 నుంచి 6కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇక్కడ పహారా కాసే సైనికులు ఏడాదిలో మూడు నెలలకోసారి […]

ఆ సైనికులు... స్నానానికి మూడునెలలు ఆగాల్సిన పనిలేదు!
X

సియాచిన్….ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న యుద్ధభూమి. ఇది భారత్, చైనా సరిహద్దు. సియాచిన్ లో ఉష్ణోగ్రతలు దాదాపు మైసన్ 60 డిగ్రీలకు పడిపోతుంటాయి. అలాంటి ప్రదేశంలో మన సైనికులు దేశ రక్షణ కోసం పహార కాస్తుంటారు.

కోల్ కతా హెడ్ క్వార్టర్స్ గా ఉన్న ఈస్టర్న్ కమాండ్… సియాచిన్ రక్షణ బాధ్యతను చేపడుతుంది. ఇక్కడ రక్షణ కోసం రోజుకు దాదాపుగా 5 నుంచి 6కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇక్కడ పహారా కాసే సైనికులు ఏడాదిలో మూడు నెలలకోసారి మారిపోతుంటారు. కానీ ఏ సమయంలో చూసినా మూడు వేల మంది సైనికులు అక్కడ ఉంటారు. సముద్రమట్టానికి 16వేల అడుగుల ఎత్తులో ఉంటారు. కొందరు అత్యధికంగా 21,700అడుగుల ఎత్తులో దేశ రక్షణ కోసం పహారా కాస్తుంటారు.

అయితే ఇక్కడ మూడు నెలలపాటూ అక్కడ ఉన్న సైనికులకు స్నానం చేసే అవకాశం ఉండదు. అయితే ఆర్మీ అధికారులు దీనికో పరిష్కారం కనుగొన్నారు. నీళ్లు అవసరం లేకుండా స్నానం చేసే విధంగా ఒక జెల్ ను కనుగొన్నారు. దాన్ని సైనికులకు సరఫరా చేస్తున్నారు. ఈ జెల్ 20 మిల్లీ లీటర్లు చాలు. మొత్తం శరీరాన్ని కవర్ చేస్తుందని అధికారులు తెలిపారు.

దీంతో వారానికి రెండుమూడుసార్లు ఇక్కడి సైనికులు స్నానం చేసే వీలుంటుంది. అయితే అక్కడి సైనికులు 130 రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 25 రకాల సమస్యలను పరిష్కరించారు.

First Published:  2 Jan 2019 3:22 AM IST
Next Story