Telugu Global
National

సచిన్ గురువు రమాకాంత్ అచ్రేకర్ కన్నుమూత

87 ఏళ్ల వయసులో అచ్రేకర్ మరణం దేశానికి దిగ్గజ క్రికెటర్లను అందించిన అచ్రేకర్ ద్రోణాచార్య, పద్మశ్రీ పురస్కారాలు అందుకొన్న అచ్రేకర్ భారత క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ గురువు, ద్రోణాచార్య రమాకాంత్ అచ్రేకర్ కన్నుమూశారు. ముంబై జోడీ సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లీ లాంటి అసాధారణ క్రికెటర్లను దేశానికి అందించడం ద్వారా అచ్రేకర్… గొప్ప శిక్షకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. వయసు మీరడంతో వచ్చిన సమస్యలతో ఆయన తన 87వ సంవత్సరంలో..ముంబైలో మరణించారు. పద్మశ్రీ, ద్రోణాచార్య లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు […]

సచిన్ గురువు రమాకాంత్ అచ్రేకర్ కన్నుమూత
X
  • 87 ఏళ్ల వయసులో అచ్రేకర్ మరణం
  • దేశానికి దిగ్గజ క్రికెటర్లను అందించిన అచ్రేకర్
  • ద్రోణాచార్య, పద్మశ్రీ పురస్కారాలు అందుకొన్న అచ్రేకర్

భారత క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ గురువు, ద్రోణాచార్య రమాకాంత్ అచ్రేకర్ కన్నుమూశారు. ముంబై జోడీ సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లీ లాంటి అసాధారణ క్రికెటర్లను దేశానికి అందించడం ద్వారా అచ్రేకర్… గొప్ప శిక్షకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు.

వయసు మీరడంతో వచ్చిన సమస్యలతో ఆయన తన 87వ సంవత్సరంలో..ముంబైలో మరణించారు. పద్మశ్రీ, ద్రోణాచార్య లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకొన్న అచ్రేకర్ అంటే…మాస్టర్ సచిన్ కు విపరీతమైన గౌరవం మాత్రమే కాదు…వల్లమాలిన అభిమానం కూడా.

తమ గురువు మృతితో సచిన్ తల్లడిల్లాడు. వివిధ టోర్నీల్లో పాల్గొనటానికి అచ్రేకర్ తన స్కూటర్ పై తనను తీసుకువెళ్ళిన సందర్భాలను సచిన్ గుర్తు చేసుకొన్నాడు. ప్రవీణ్ ఆమ్రే, బల్విందర్ సింగ్ సంధూ, సమీర్ డిఘే సైతం అచ్రేకర్ శిష్యులే కావడం విశేషం.

ప్రతి ఏడాదీ ఉపాధ్యాయ దినోత్సవం రోజున అచ్రేకర్ ను సచిన్ కలసి తన కృతజ్ఞతలు తెలపటమే కాదు…ఆశీస్సులు కూడా తీసుకోడం ఓ అలవాటుగా మార్చుకొన్నాడు.

1990లో కేంద్రప్రభుత్వం అచ్రేకర్ కు ఉత్తమ గురువుకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ఇచ్చి సత్కరించింది. 2010లో పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అచ్రేకర్ అందుకొన్నారు. అచ్రేకర్ మృతితో భారత్ ఓ గొప్ప క్రికెట్ గురువును కోల్పోయినట్లయ్యింది.

First Published:  2 Jan 2019 5:02 PM IST
Next Story