ఆ ఆర్మీ ఆఫీసర్ నిర్మలా సీతారామన్ కూతురు కాదు..!
గత వారం రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త వైరల్‌గా మారింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఉన్న ఒక యువ ఆర్మీ అధికారిణి ఫొటో ఉంచి ‘ఈమె నిర్మలా సీతారామన్ కూతురు. రాజకీయాలలోకి రాకుండా ఇలా దేశ సేవలో ఉంది. తల్లీకూతుర్లకు సెల్యూట్’ అంటూ రాశారు. ఈ పోస్టు గత నాలుగు రోజుల్లో వైరల్‌గా మారింది. కాగా, ఈ విషయమై ఒక వార్తా సంస్థ ఆరా తీయగా పలు విషయాలు తెలిశాయి. […]
గత వారం రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త వైరల్‌గా మారింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఉన్న ఒక యువ ఆర్మీ అధికారిణి ఫొటో ఉంచి ‘ఈమె నిర్మలా సీతారామన్ కూతురు. రాజకీయాలలోకి రాకుండా ఇలా దేశ సేవలో ఉంది. తల్లీకూతుర్లకు సెల్యూట్’ అంటూ రాశారు. ఈ పోస్టు గత నాలుగు రోజుల్లో వైరల్‌గా మారింది.
కాగా, ఈ విషయమై ఒక వార్తా సంస్థ ఆరా తీయగా పలు విషయాలు తెలిశాయి. ఈ ఫొటో నిర్మలా సీతారామన్ ఒక ఆర్మీ కేంద్రానికి వెళ్లినప్పుడు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారిణి.. మంత్రితో ఫొటో దిగారని ఆర్మీ అధికార ప్రతినిధి అమన్ ఆనంద్ స్పష్టం చేశారు.
అయితే ఆర్మీ ప్రతినిధి వివరణ ఇచ్చినా కూడా.. ‘Team Modi Supporter Jalalur’, ‘I Cupport Rss’ అనే ఫేస్‌బుక్ పేజీలు నిర్మలా సీతారామన్ కూతురే అంటూ ప్రచారం చేస్తున్నాయి. రివర్సల్ ఇమేజ్ పద్దతిలో పరీక్షించిన తర్వాత కూడా ఈమెకు మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేలింది.