Telugu Global
National

కర్నూలు సోనామసూరి రైస్ కనుమరుగు అవుతుందా?

కర్నూలు సోనా మసూరి‌. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందిన రైస్ ఇది. కర్నాటక, తమిళనాడులో కూడా ఈ బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ బియ్యం రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువగా పండుతుంది. ఇక్కడి వాతావరణం సెట్‌ అవడంతోనే ఈ వంగడం దిగుబడి ఈప్రాంతంలో అధికంగా ఉంటోంది. కర్నూలు సోనాను బీపీటీ 5204 అని కూడా అంటారు. ఇంటర్నేషనల్‌ రిసెర్చ్ సెంటర్‌ కూడా కర్నూలు సోనా బియ్యాన్ని అత్యుత్తమ రకంగా సర్టిఫై చేసింది. ఇప్పుడు […]

కర్నూలు సోనామసూరి రైస్ కనుమరుగు అవుతుందా?
X

కర్నూలు సోనా మసూరి‌. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందిన రైస్ ఇది. కర్నాటక, తమిళనాడులో కూడా ఈ బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ బియ్యం రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువగా పండుతుంది. ఇక్కడి వాతావరణం సెట్‌ అవడంతోనే ఈ వంగడం దిగుబడి ఈప్రాంతంలో అధికంగా ఉంటోంది. కర్నూలు సోనాను బీపీటీ 5204 అని కూడా అంటారు. ఇంటర్నేషనల్‌ రిసెర్చ్ సెంటర్‌ కూడా కర్నూలు సోనా బియ్యాన్ని అత్యుత్తమ రకంగా సర్టిఫై చేసింది.

ఇప్పుడు ఈ కర్నూలు సోనా దిగుబడి సంక్షోభంలో పడుతోంది. పదేళ్ల క్రితం వరకు కర్నూలు, కడప పరిధిలోని కేసీ కెనాల్ కింద లక్షా 70వేల ఎకరాల్లో కర్నూలు సోనా వరి సాగు అయ్యేది. ఇప్పుడా విస్తీర్ణం 60వేల ఎకరాలకు పడిపోయింది. కర్నూలు సోనాను ఎక్కువగా పండించే నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు ప్రాంతాల్లోనూ సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది.

సాగు నీరు సరిగా అందకపోవడం వల్లే విస్తీర్ణం తగ్గిపోతోందని రైతులు చెబుతున్నారు. సకాలంలో నీరు విడుదల కాకపోవడంతో ఆలస్యంగా పంట వేయడం వల్ల నెక్ బ్లాస్ట్‌ డిసీజ్‌కు పంట గురవుతోంది. నీటి లభ్యత సమస్య, తెగుళ్ల కారణంగా దిగుబడి 2.54 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1.5 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది.

సకాలంలో నీరు అందకపోవడం, నెక్ బ్టాస్ట్ డిసీస్ కారణంగా ఏటా కర్నూలు సోనా మసూరి దిగుబడి భారీగా పడిపోతోందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. తెగుళ్ల కారణంగా పడిపోతున్న దిగుబడి విలువ ఏటా వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

First Published:  2 Jan 2019 7:50 AM IST
Next Story