మహాకూటమికి కోదండరాం గుడ్ బై... పంచాయితీలో ఒంటరిగానే పోటీ
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవి చూసిన కోదండరాం సారధ్యంలోని తెలంగాణ జనసమితి సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీని సంస్థాగతంగా బలపరచాలంటే పంచాయితీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో పార్టీ గుర్తులపై పోటీ చేసే అవకాశం లేకపోయినా ప్రధాన రాజకీయ పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులను రంగంలోకి దింపుతుంటాయి. టీజేఎస్ కూడా తాము బలపరిచిన అభ్యర్థులను పంచాయితీ ఎన్నికల్లో పోటీకి నిలపాలని నిర్ణయించింది. మహాకూటమితో వెళితే మరింత నష్టం చేకూరే ప్రమాదం […]
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవి చూసిన కోదండరాం సారధ్యంలోని తెలంగాణ జనసమితి సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీని సంస్థాగతంగా బలపరచాలంటే పంచాయితీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
పంచాయితీ ఎన్నికల్లో పార్టీ గుర్తులపై పోటీ చేసే అవకాశం లేకపోయినా ప్రధాన రాజకీయ పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులను రంగంలోకి దింపుతుంటాయి. టీజేఎస్ కూడా తాము బలపరిచిన అభ్యర్థులను పంచాయితీ ఎన్నికల్లో పోటీకి నిలపాలని నిర్ణయించింది. మహాకూటమితో వెళితే మరింత నష్టం చేకూరే ప్రమాదం ఉందని కోదండరాం భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం మహాకూటమిగా జట్టు కట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశామని…. అయితే పంచాయితీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీని కింది స్థాయి నుంచి బలపరిచే ప్రణాళిక రూపొందిస్తున్నామని…. ఇందులో భాగంగానే ఒంటరి పోరుకు సిద్దపడ్డామని ఆయన చెబుతున్నారు.