దానంకు ఏమైంది.... ఎందుకంత డిప్రెషన్ లోకి వెళ్లారు?
దానం నాగేందర్…. కాంగ్రెస్ లో ఓ వెలుగువెలిగిన నేత. మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కారు గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఈ మధ్యే జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రి పదవి కోసం ఆశగా ఎదురుచూస్తూ…. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ దానం గెలవడనుకున్న స్థానంలో గెలిచి చూపించాడు. ఎమ్మెల్యేగా గెలుపొందిన సంతోషం నుంచి తేరుకోకముందే… దానం తీవ్ర ఒత్తిడితో మానసిక ప్రశాంతతను కోల్పోయారని ప్రచారం జరుగుతోంది. దానంకు అనారోగ్య సమస్యలు […]
దానం నాగేందర్…. కాంగ్రెస్ లో ఓ వెలుగువెలిగిన నేత. మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కారు గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఈ మధ్యే జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రి పదవి కోసం ఆశగా ఎదురుచూస్తూ…. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ దానం గెలవడనుకున్న స్థానంలో గెలిచి చూపించాడు.
ఎమ్మెల్యేగా గెలుపొందిన సంతోషం నుంచి తేరుకోకముందే… దానం తీవ్ర ఒత్తిడితో మానసిక ప్రశాంతతను కోల్పోయారని ప్రచారం జరుగుతోంది. దానంకు అనారోగ్య సమస్యలు వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. తీవ్ర డిప్రెషన్ తో కేరళకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారని సమాచారం. అసలు దానంకు ఏమైంది. ఎందుకంత డిప్రెషన్లోకి వెళ్లారు.
ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. మంత్రి పదవిపై దానం నాగేందర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం కావడంతో…. పదవి వరిస్తుందో లేదోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారట.
దీంతో ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా బాగోలేదని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. చికిత్స కోసం కేరళకు తీసుకెళ్లారట. అడుగులు తడబడటం… మాటలు వంకరపోవడం చూసి కుటుంబ సభ్యులు కేరళకు తీసుకెళ్లారట. కేరళలో చికిత్స చేయించుకోని ఈ మధ్యే హైదరాబాద్ కు వచ్చారని సమాచారం.