ఇద్దరు డైరెక్టర్స్ కి డెడ్ లైన్ పెట్టిన నాగార్జున
అక్కినేని నాగార్జున ఈ ఏడాది రెండు కొత్త సినిమాలతో రాబోతున్నాడు, ఇప్పటికే ఆ సినిమాలని డైరెక్ట్ చేసే దర్శకులకి డెడ్ లైన్ డేట్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. గత ఏడాది “ఛి. లా.సౌ” సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు హీరో రాహుల్ రవీంద్రన్. సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఈ ప్రేమ కథ ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకుంది. ఇక ఇప్పుడు నాగార్జున, రాహుల్ రవీంద్రన్ ని పిలిచి “మన్మధుడు 2” సినిమాని డైరెక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం […]
అక్కినేని నాగార్జున ఈ ఏడాది రెండు కొత్త సినిమాలతో రాబోతున్నాడు, ఇప్పటికే ఆ సినిమాలని డైరెక్ట్ చేసే దర్శకులకి డెడ్ లైన్ డేట్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. గత ఏడాది “ఛి. లా.సౌ” సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు హీరో రాహుల్ రవీంద్రన్. సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఈ ప్రేమ కథ ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకుంది. ఇక ఇప్పుడు నాగార్జున, రాహుల్ రవీంద్రన్ ని పిలిచి “మన్మధుడు 2” సినిమాని డైరెక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం రాహుల్ ఆ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. చిన్న సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి లో స్టార్ట్ చేసి మే వరకు సినిమాని రిలీజ్ చేద్దాం అనే ఆలోచనలో నాగార్జున ఉన్నాడట.
ఇదే విధంగా కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో “బంగార్రాజు” అనే సినిమాని కూడా స్టార్ట్ చేస్తాడు నాగార్జున. నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమా కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే కొంచెం పెద్ద బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న ఈ సినిమాని యొక్క షూటింగ్ ని మే లో స్టార్ట్ చేసి దసరాకి సినిమాని రిలీజ్ చేయాలి అనేది నాగార్జున ప్లాన్ అంట. మొత్తానికి రెండు సినిమాల్ని లైన్ లో పెట్టి డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేసాడు నాగార్జున.