వాలిని రాముడు చంపడం... ఎన్టీఆర్‌ను చంద్రబాబు దింపడం ఒక్కటే...
రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై నటుడు శివాజీ స్పందించారు. వెన్నుపోటుకు, వెన్నుదన్నుకు తేడా తెలియని వర్మ సినిమా తీస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు తాను భావించడం లేదన్నారు. ఆనాడు రాముడు చెట్టు చాటు నుంచి వాలిని బాణం కొట్టి చంపి ధర్మం వైపు నిలబడ్డారని… చంద్రబాబు కూడా అదే చేశారన్నారు. టీడీపీని రక్షించుకునేందుకు చంద్రబాబు రాముడి పాత్ర పోషించారన్నారు. వైస్రాయ్ ఘటన జరిగినప్పుడు తాను ప్రత్యక్షంగా అక్కడే ఉన్నానని చెప్పారు. […]
రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై నటుడు శివాజీ స్పందించారు. వెన్నుపోటుకు, వెన్నుదన్నుకు తేడా తెలియని వర్మ సినిమా తీస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు తాను భావించడం లేదన్నారు.
ఆనాడు రాముడు చెట్టు చాటు నుంచి వాలిని బాణం కొట్టి చంపి ధర్మం వైపు నిలబడ్డారని… చంద్రబాబు కూడా అదే చేశారన్నారు. టీడీపీని రక్షించుకునేందుకు చంద్రబాబు రాముడి పాత్ర పోషించారన్నారు. వైస్రాయ్ ఘటన జరిగినప్పుడు తాను ప్రత్యక్షంగా అక్కడే ఉన్నానని చెప్పారు. వైస్రాయ్ వద్ద ఎన్టీఆర్‌పై చెప్పులు వేసిన వారు లక్ష్మీపార్వతి మనుషులేనని, తాను స్వయంగా చూశానని శివాజీ చెప్పారు.
చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదని పార్టీకి దన్నుగా నిలబడ్డారని శివాజీ అన్నారు. ఆ సమయంలో కేసీఆర్ కూడా చంద్రబాబు పక్షానే ఉన్నారన్నారు. చంద్రబాబు ఆరోజు టీడీపీని రక్షించి ఉండకపోతే కేంద్రంలో బీజేపీ కూడా ఉండేది కాదని… వాజ్‌పేయ్ ప్రధాని అయ్యే వారు కాదని శివాజీ చెప్పారు. చంద్రబాబుది రాముడు పాత్ర కాగా… లక్ష్మీపార్వతిది వాలి పాత్ర అని శివాజీ చెప్పారు.