ఓటర్ ఐడీ " మొబైల్ నెంబర్ అనుసంధానం.... మొదటి రాష్ట్రంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓటు, ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఓటర్లకు సులువుగా చేరవేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. దానితో పాటు ఓటర్ లిస్ట్‌లో పారదర్శకత తీసుకొచ్చేందుకు కొత్త ఆలోచన చేస్తోంది. ఓటర్ ఐడీని మొబైల్ నెంబర్ తో అనుసంధానం చేస్తున్నట్టు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఆర్ పి సిసోడియా వెల్లడించారు. దేశంలో ఇలా ఓటర్ ఐడీని మొబైల్ నెంబర్‌తో అనుసంధానం చేయబడుతున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏపీలో మొత్తం 3 కోట్ల 70 […]
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓటు, ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఓటర్లకు సులువుగా చేరవేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. దానితో పాటు ఓటర్ లిస్ట్‌లో పారదర్శకత తీసుకొచ్చేందుకు కొత్త ఆలోచన చేస్తోంది.
ఓటర్ ఐడీని మొబైల్ నెంబర్ తో అనుసంధానం చేస్తున్నట్టు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఆర్ పి సిసోడియా వెల్లడించారు. దేశంలో ఇలా ఓటర్ ఐడీని మొబైల్ నెంబర్‌తో అనుసంధానం చేయబడుతున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
ఏపీలో మొత్తం 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సిసోడియా తెలిపారు. దాదాపు అందరు ఓటర్ల వద్ద మొబైల్ ఫోన్లు ఉన్న నేపథ్యంలో వాటిని అనుసంధానం చేస్తున్నట్టు చెప్పారు. ఇలా చేయడం ద్వారా ఎన్నికల సంఘానికి సంబంధించిన సమాచారాన్ని వెంటనే ఎస్‌ఎంఎస్ రూపంలో ఓటర్లకు చేరవేసే అవకాశం ఉంటుందన్నారు.
ఈ అనుసంధాన పక్రియ కోసం త్వరలోనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఓటర్లు కూడా తమ ఓటుకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఎస్‌ఎంఎస్ ద్వారానే తెలుసుకునే వీలుంటుందని సిసోడియా వివరించారు.
ఓటర్ ఒక్క మెసేజ్ పంపితే … వెంటనే అతడి పేరు, తండ్రిపేరు, అడ్రస్, పోలింగ్ కేంద్రం, పోస్టల్ పిన్ కోడ్ అన్ని విషయాలు కొత్త సదుపాయం ద్వారా తెలుసుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఓటర్లు మెసేజ్ చేస్తే పోలింగ్ కేంద్రానికి ఎలా వెళ్లాలో సూచించే మ్యాప్‌ను కూడా పంపుతామని సిసోడియా వివరించారు.
జనవరి 11న ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు చోటు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ఐఏఎస్‌లు పర్యవేక్షిస్తున్నారని సిసోడియా వివరించారు.