ఇక వచ్చేది ఏమీ లేదు.... బాబు భావోద్వేగం...
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం…. హైకోర్టు ఏర్పాటు కార్యక్రమం మంగళవారం ఉదయం విజయవాడలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఈ వేడుకలో పాల్గొన్న చంద్రబాబు కాస్త భావో ద్వేగం…. నిర్వేదంతో మాట్లాడారు. హైకోర్టు హైదరాబాద్ నుంచి ఏపీకి రావడంతో విభజన పూర్తి స్థాయిలో అయిపోయినట్టేనని…. ఇక మనకు హైదరాబాద్ తో సంబంధం లేదని…. ఏదైనా మనది మనమే […]
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం…. హైకోర్టు ఏర్పాటు కార్యక్రమం మంగళవారం ఉదయం విజయవాడలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
ఈ వేడుకలో పాల్గొన్న చంద్రబాబు కాస్త భావో ద్వేగం…. నిర్వేదంతో మాట్లాడారు. హైకోర్టు హైదరాబాద్ నుంచి ఏపీకి రావడంతో విభజన పూర్తి స్థాయిలో అయిపోయినట్టేనని…. ఇక మనకు హైదరాబాద్ తో సంబంధం లేదని…. ఏదైనా మనది మనమే చూసుకోవాలని చంద్రబాబు ఉద్వేగానికి గురయ్యారు. భౌతికంగా ఇక తెలంగాణ నుంచి మనకు వచ్చేవి ఏమీ లేవన్నారు.
హైకోర్టు హడావుడి విభజనతో సరైన ఏర్పాట్లు చేయలేకపోయామని…. ఇంకా సమస్యలున్నాయని చంద్రబాబు అన్నారు. అయినా కూడా తాను ఇబ్బందులు లేకుండా ముందుండి ఏర్పాట్లు చేయించానన్నారు.
దీనిపై తాను చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పినప్పుడు…. ఆయన ఎంత కష్టమైనా హైకోర్టు నడిపిస్తామని ధైర్యం చెప్పారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇబ్బందులున్నాయని…. శ్రమ ఉందని…. రాబోయే రోజుల్లో అమరావతిని చరిత్రలో నిలిచేలా కడతానని చంద్రబాబు చెప్పారు.