ఏపీ లాయర్ల పిటిషన్ తిరస్కరణ... విభజన యథాతధం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు విభజనను తాత్కాలికంగా వాయిదా వేయాలంటూ ఏపీ న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ మోషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించింది. జనవరి 2న సాధారణ పద్దతిలోనే పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన హైకోర్టు న్యాయమూర్తుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం యథాతధంగా కొనసాగనుంది. ఏపీలో ఇంకా హైకోర్టు భవనం […]
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు విభజనను తాత్కాలికంగా వాయిదా వేయాలంటూ ఏపీ న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ మోషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించింది. జనవరి 2న సాధారణ పద్దతిలోనే పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన హైకోర్టు న్యాయమూర్తుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం యథాతధంగా కొనసాగనుంది.
ఏపీలో ఇంకా హైకోర్టు భవనం పూర్తి కాకపోవడం, జడ్జీల నివాస సముదాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు సిద్ధం కాకపోవడంతో హైకోర్టు విభజనను తాత్కాలికంగా వాయిదా వేయాలంటూ న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.