ఆ హ్యాష్ ట్యాగ్ కు అర్థం ఏంటబ్బా?
రాజమౌళి కొడుకు కార్తికేయ-పూజ పెళ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్స్ అంతా ఆ పెళ్లికి హాజరయ్యారు. అంతా బాగానే ఉంది కానీ ఒకటి మాత్రం చాలామందికి ప్రశ్నార్థకంగా మారింది. పెళ్లి వేడుకల్లో భాగంగా స్టార్స్, వాళ్ల భార్యలంతా ఎప్పటికప్పుడు ఫొటోల్ని షేర్ చేస్తూ.. ఓ హ్యాష్ ట్యాగ్ వాడుతున్నారు. దాని అర్థం ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ముందుగా చరణ్ భార్య ఉపాసన దీన్ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుకకు సంబంధించిన స్టిల్స్ ను ఎప్పటికప్పుడు […]
రాజమౌళి కొడుకు కార్తికేయ-పూజ పెళ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్స్ అంతా ఆ పెళ్లికి హాజరయ్యారు. అంతా బాగానే ఉంది కానీ ఒకటి మాత్రం చాలామందికి ప్రశ్నార్థకంగా మారింది. పెళ్లి వేడుకల్లో భాగంగా స్టార్స్, వాళ్ల భార్యలంతా ఎప్పటికప్పుడు ఫొటోల్ని షేర్ చేస్తూ.. ఓ హ్యాష్ ట్యాగ్ వాడుతున్నారు. దాని అర్థం ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
ముందుగా చరణ్ భార్య ఉపాసన దీన్ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుకకు సంబంధించిన స్టిల్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్న ఈమె, తన ట్వీట్ లో భాగంగా #BangaramSaysSS అనే హ్యాష్ ట్యాగ్ ను వాడారు. ఆ తర్వాత చాలామంది ప్రముకులు ఇదే హ్యాష్ టాగ్ ఉపయోగిస్తూ ఫొటోలు షేర్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ పై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది.
ఎస్ఎస్ కార్తికేయ తన కాబోయే భార్యను బంగారం అని ముద్దుగా పిలుచుకుంటాడట. పూజా కూడా కార్తికేయను ఎస్ఎస్ అంటూ ముద్దుగా సంభోదిస్తుందట. అందుకే “బంగారం సేస్ ఎస్ఎస్” అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ ప్రముఖులంతా ఫొటోలు షేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మోన్న రాత్రి ఈ పెళ్లికి సంబంధించి సంగీత్ పూర్తయింది. ఆ వేడుకలో ప్రభాస్-అనుష్క డాన్స్ చేసి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. వీళ్లతో పాటు నాగార్జున, రామ్ చరణ్, రానా, అఖిల్ప్ లాంటి హీరోలంతా కొన్ని పాటలకు స్టెప్పులేశారు. నిన్న రాత్రి కార్తికేయ-పూజ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.