Telugu Global
NEWS

అలాంటి వారికి నేను అండగా ఉంటా " బిగ్ బాస్ కౌశల్

బిగ్‌బాస్-2 విన్నర్ కౌశల్‌ ఈసారి హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు జరుపుకోవడం లేదు. ఆయన విజయవాడకు వచ్చేశారు. విజయవాడలో జరిగే న్యూఇయర్ వేడుకల్లో కౌశల్ పాల్గొంటున్నారు. ఈవెంట్‌ నిర్వాహకుడిగా కూడా పేరున్న కౌశల్ … ఈసారి విజయవాడలో వేడుకలు జరుపుకోవాలనే తాను వచ్చినట్టు చెప్పారు. చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లోనే న్యూఇయర్ వేడుకలు జరుపుకునే వాడినని… కానీ మన ఊరిలోనే సెలబ్రేషన్స్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈసారి విజయవాడలో ప్లాన్‌ చేసినట్టు చెప్పారు. చాలా మంది న్యూఇయర్ వేడుకల కోసం విజయవాడ […]

అలాంటి వారికి నేను అండగా ఉంటా  బిగ్ బాస్ కౌశల్
X

బిగ్‌బాస్-2 విన్నర్ కౌశల్‌ ఈసారి హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు జరుపుకోవడం లేదు. ఆయన విజయవాడకు వచ్చేశారు. విజయవాడలో జరిగే న్యూఇయర్ వేడుకల్లో కౌశల్ పాల్గొంటున్నారు.

ఈవెంట్‌ నిర్వాహకుడిగా కూడా పేరున్న కౌశల్ … ఈసారి విజయవాడలో వేడుకలు జరుపుకోవాలనే తాను వచ్చినట్టు చెప్పారు. చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లోనే న్యూఇయర్ వేడుకలు జరుపుకునే వాడినని… కానీ మన ఊరిలోనే సెలబ్రేషన్స్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈసారి విజయవాడలో ప్లాన్‌ చేసినట్టు చెప్పారు.

చాలా మంది న్యూఇయర్ వేడుకల కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటారని… కానీ విజయవాడలో కూడా బాగా వేడుకలు జరిపి ఇక్కడి ప్రజలను ఉత్సాహపరిచేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. విజయవాడ అంటే తనకు ప్రత్యేక అభిమానం అని చెప్పారు.

తన కౌశల్ ఆర్మీపై వస్తున్న విమర్శలకు ఆయన తీవ్రంగా స్పందించారు. పని లేని వారు, గేమ్ అంటే ఏంటో తెలియని వారే తన ఆర్మీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తనలాగే గేమ్ ఆడితే ఎవరికైనా టైటిల్ వస్తుంది. కానీ వారికి ఆట అంటే ఏంటో తెలియదని… తెలిసుకునే లోపే గేమ్ కూడా అయిపోయిందని ఎద్దేవా చేశారు. తనపై ఈర్షతోనే కొందరు కౌశల్ ఆర్మీపై వ్యాఖ్యలు చేస్తున్నారని…. వాటిని తాను పట్టించుకోబోనన్నారు.

చిత్ర పరిశ్రమలో బ్యాక్‌ గ్రౌండ్‌ లేని టాలెంట్‌ పీపుల్‌ను ఎవరూ ప్రోత్సహించడం లేదన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వారిని ప్రమోట్ చేసేందుకు కౌశల్ మోడలింగ్ ఏజెన్సీ ద్వారా తాను సాయపడుతానని, వారికి అండగా ఉంటానని చెప్పారు. టాలెంట్‌ పేరుతో ముంబాయి నుంచి నటులను తెచ్చుకునే పరిస్థితి పోయి తెలుగువారినే ప్రోత్సహించే పరిస్థితి రావాలన్నారు.

First Published:  31 Dec 2018 1:17 PM IST
Next Story