నేను మళ్లీ గెలిస్తే ఒక్కరినీ వదిలిపెట్టను " అఖిలప్రియ వార్నింగ్
మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్థులకు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం ఆళ్లగడ్డలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన మంత్రి అఖిల… తన జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తనను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు ప్రత్యర్థులంతా ఏకమయ్యారని కార్యకర్తలతో చెప్పారు. నంద్యాలలో గెలవలేని వారు కూడా ఇప్పుడు తనను ఓడిస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ తనను ఓడించడం సాధ్యమయ్యే పని కాదన్నారు. తనను ఓడించేందుకు ఏకమైన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారామె. తాను […]
మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్థులకు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం ఆళ్లగడ్డలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన మంత్రి అఖిల… తన జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
తనను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు ప్రత్యర్థులంతా ఏకమయ్యారని కార్యకర్తలతో చెప్పారు. నంద్యాలలో గెలవలేని వారు కూడా ఇప్పుడు తనను ఓడిస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ తనను ఓడించడం సాధ్యమయ్యే పని కాదన్నారు. తనను ఓడించేందుకు ఏకమైన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారామె.
తాను తిరిగి గెలిస్తే తనను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని తేల్చిచెప్పారామె. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని చెప్పారు. తాను తిరిగి గెలిస్తే ప్రత్యర్థులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని… అలా అని తప్పుడు కేసులు పెట్టడం, దాడులు చేయించడం వంటి పనులు మాత్రం తాను చేయబోనన్నారు.
ప్రత్యర్థులను ప్రజలు మరిచిపోయేలా పనిచేస్తానని చెప్పారు. ఆళ్లగడ్డలో కీలక నేతగా ఉంటూ వచ్చిన రాంపుల్లారెడ్డి అఖిలప్రియ వైఖరి నచ్చక టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.
ఇదే సమయంలో భూమా అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డికి, అఖిలప్రియకు పడడం లేదు. నంద్యాల నియోజక వర్గంలో భూమా బ్రహ్మానందరెడ్డికి చెక్ పెట్టేలా మంత్రి ఫరూక్ పావులు కదుపుతున్నారు. ఈనేపథ్యంలో భూమా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.