Telugu Global
International

బంగ్లా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రక్తసిక్తం.... 17మంది మృతి!

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనల నడుమ ఆదివారం ముగిసింది. ఎన్నికల వేళ చెలరేగిన హింసలో దాదాపు 17మంది మరణించినట్లు సమాచారం. రాజ్‌షాహి, చిత్తగావ్‌, కుమిల్లా, కాక్స్‌బజార్‌ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తుల చొప్పున చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మొదటిసారిగా EVMలతో జరుగుతున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు అధికార అవామీ లీగ్‌కే బంగ్లా ఓటర్లు మరోసారి పట్టం కట్టనున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బ్రమ్మణబెరియా, రంగమతి, నార్సిది, బొగుర, గజీపూర్‌, […]

బంగ్లా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రక్తసిక్తం.... 17మంది మృతి!
X

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనల నడుమ ఆదివారం ముగిసింది. ఎన్నికల వేళ చెలరేగిన హింసలో దాదాపు 17మంది మరణించినట్లు సమాచారం.

రాజ్‌షాహి, చిత్తగావ్‌, కుమిల్లా, కాక్స్‌బజార్‌ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తుల చొప్పున చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మొదటిసారిగా EVMలతో జరుగుతున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు అధికార అవామీ లీగ్‌కే బంగ్లా ఓటర్లు మరోసారి పట్టం కట్టనున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బ్రమ్మణబెరియా, రంగమతి, నార్సిది, బొగుర, గజీపూర్‌, సిల్హెట్‌లో చెలరేగిన అల్లర్లలో ఒక్కరి చొప్పున మరణించారు. మృతుల్లో పాలక అవామీ లీగ్‌ కార్యకర్తలే అధికంగా ఉన్నట్లు సమాచారం. ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్, కూటమి పార్టీలు మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మరోసారి ప్రతిపక్షానికి పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

First Published:  31 Dec 2018 3:26 AM IST
Next Story