Telugu Global
NEWS

నో బొకేస్‌... ఓన్లీ దుప్పట్లు " కలెక్టర్ దివ్యా పిలుపు

ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో ఆమె చేస్తున్న కార్యక్రమాలు గత కలెక్టర్లకు భిన్నంగా ఉంటున్నాయి. పేదలకు మేలు చేసేందుకు ఎంతకైనా ఆమె సిద్ధపడుతున్నారు. గిరిజనులకు అండగా ఉంటూ జిల్లాలో అందరి మన్ననలు పొందుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా చలికి వణికిపోతోంది. జిల్లాలోని పలు ప్రాతాల్లో రెండు డిగ్రీలకు ఉష్ట్రోగ్రతలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ దివ్యా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్‌లో నైట్‌ షెడ్‌ లను ఏర్పాటు […]

నో బొకేస్‌...  ఓన్లీ దుప్పట్లు   కలెక్టర్ దివ్యా పిలుపు
X

ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో ఆమె చేస్తున్న కార్యక్రమాలు గత కలెక్టర్లకు భిన్నంగా ఉంటున్నాయి. పేదలకు మేలు చేసేందుకు ఎంతకైనా ఆమె సిద్ధపడుతున్నారు. గిరిజనులకు అండగా ఉంటూ జిల్లాలో అందరి మన్ననలు పొందుతున్నారు.

తాజాగా ఆదిలాబాద్ జిల్లా చలికి వణికిపోతోంది. జిల్లాలోని పలు ప్రాతాల్లో రెండు డిగ్రీలకు ఉష్ట్రోగ్రతలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ దివ్యా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్‌లో నైట్‌ షెడ్‌ లను ఏర్పాటు చేయించారామె. ఇళ్లు లేని వారు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు రాత్రి వేళ్లలో ఉండేందుకు ఈ నైట్ షెడ్లను తెరిచారు.

వారికి దుప్పట్లు కూడా అందుబాటులో ఉంచారు. ఇలా గూడులేని వారిని చలి నుంచి రక్షించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. పేదలను చలి నుంచి కాపాడేందుకు దుప్పట్లు సేకరించి వాటిని పంచుతున్నారు. జనవరి ఫస్ట్‌ నాడు తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చే అధికారులు, సిబ్బంది, ఇతరులకు ఆమె కొన్ని సూచనలు చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బొకేలు తీసుకు రావద్దని చెప్పారు. బొకేల స్థానంలో ఉన్ని దుస్తులు గానీ, దుప్పట్లు గానీ తీసుకురావాలని సూచించారు. అలా వచ్చిన వాటిని పేదలకు పంచిపెడుతామని కలెక్టర్ దివ్యా దేవరాజన్‌ వివరించారు. కలెక్టర్ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.

First Published:  31 Dec 2018 4:27 AM GMT
Next Story