త్వరలో విశాల్ నిశ్చితార్ధం.... అమ్మాయి పేరు అనీశా....
సినీ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ పెళ్లి పీట లెక్క బోతున్నారు. నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ, విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా కాలంగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. త్వరలోనే విశాల్ నిశ్చితార్ధం జరగనుంది. అయితే వరలక్ష్మీతో కాదు. హైదరాబాద్‌కు చెందిన అనిశా అనే అమ్మాయిని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని విశాల్ తండ్రి ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి… ఒక తమిళ పత్రిక వద్ద వెల్లడించారు. విశాల్, అనిశాల ఎంగేజ్‌మెంట్ […]

సినీ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ పెళ్లి పీట లెక్క బోతున్నారు. నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ, విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా కాలంగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
త్వరలోనే విశాల్ నిశ్చితార్ధం జరగనుంది. అయితే వరలక్ష్మీతో కాదు. హైదరాబాద్‌కు చెందిన అనిశా అనే అమ్మాయిని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని విశాల్ తండ్రి ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి… ఒక తమిళ పత్రిక వద్ద వెల్లడించారు.
విశాల్, అనిశాల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లోనే జరగనుంది. విశాల్ వివాహంపై చాలాకాలంగా చర్చ జరుగుతూ వచ్చింది. కానీ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్ మాత్రం… నడిగర్ సంఘం భవనాన్ని నిర్మించే వరకు పెళ్లి చేసుకోబోనని శపథం చేశారు. అన్నట్టుగా శపథం నెగ్గించుకుని పెళ్లికి సిద్ధమయ్యాడు.