Telugu Global
Cinema & Entertainment

2018 రౌండప్: గెలుపు గుర్రాలు వీళ్లే!

ప్రతి ఏడాది ఒకేలా ఉండదు. ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో అలాంటి మెరుపులు కనిపించాయి. ఊహించని విధంగా కొంతమంది హీరోలు హిట్స్ కొడితే, క్రేజ్ ఉన్నప్పటికీ హిట్ కొట్టలేక చతికిలపడ్డారు మరికొందరు హీరోలు. ముందుగా సక్సెస్ ఇచ్చిన హీరోల లిస్ట్ చూసుకుంటే ఇందులో రామ్ చరణ్ నే ఫస్ట్ చెప్పుకోవాలి. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రంగస్థలం ఈ హీరో ఖాతాలోనిదే. ఇలా సక్సెస్ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ తర్వాతే ఏ […]

2018 రౌండప్: గెలుపు గుర్రాలు వీళ్లే!
X

ప్రతి ఏడాది ఒకేలా ఉండదు. ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో అలాంటి మెరుపులు కనిపించాయి. ఊహించని విధంగా కొంతమంది హీరోలు హిట్స్ కొడితే, క్రేజ్ ఉన్నప్పటికీ హిట్ కొట్టలేక చతికిలపడ్డారు మరికొందరు హీరోలు. ముందుగా సక్సెస్ ఇచ్చిన హీరోల లిస్ట్ చూసుకుంటే ఇందులో రామ్ చరణ్ నే ఫస్ట్ చెప్పుకోవాలి. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రంగస్థలం ఈ హీరో ఖాతాలోనిదే. ఇలా సక్సెస్ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ తర్వాతే ఏ హీరో అయినా.

చరణ్ తర్వాత స్థానంలో మహేష్ బాబు నిలుస్తాడు. ఇతడు నటించిన భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ ఇద్దరు హీరోల తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ హీరో నటించిన గీతగోవిందం సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఓవరాల్ వసూళ్ల సంగతి పక్కనపెడితే.. రంగస్థలం, భరత్ అనే నేను కంటే కూడా ఈ సినిమాకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్కువ. అదే ఊపులో టాక్సీవాలాతో మరో ప్రాఫిటబుల్ మూవీ కూడా అందించాడు విజయ్ దేవరకొండ.

2018లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన హీరోలు ఈ ముగ్గురే. వీళ్ల తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి ఎన్టీఆర్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటించిన అరవింద సమేత చిత్రం పెద్దగా ఆడలేదు. అలా అని దీన్ని ఫ్లాప్ అనలేం. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు ఇది నష్టాలు మిగిల్చినప్పటికీ ఓవరాల్ గా సక్సెస్ ఫుల్ సినిమాల లిస్ట్ లోకి చేరిపోయింది. అయితే ఇది ఎన్టీఆర్, త్రివిక్రమ్ రేంజ్ సినిమా మాత్రం కాదు. ఈ ఏడాది హిట్ కొట్టిన హీరోల లిస్ట్ లో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. తొలిప్రేమ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ హీరో, రీసెంట్ గా వచ్చిన అంతరిక్షం సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకోగలిగాడు.

నాగశౌర్య మాత్రం నిరాశపరిచాడు. ఈ ఏడాది మొట్టమొదటి సూపర్ హిట్ ఛలోతో బోణీకొట్టిన శౌర్య, ఆ తర్వాత వరుసగా కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల అంటూ ఫ్లాపులిచ్చాడు. సుధీర్ బాబు, నాగచైతన్య కూడా అంతే. సమ్మోహనంతో హిట్ కొట్టి, నన్ను దోచుకుందువటే అంటూ ఫ్లాప్ తో పలకరించాడు సుధీర్ బాబు. అటు నాగచైతన్య, శైలజారెడ్డి అల్లుడు లాంటి యావరేజ్ మూవీతోనే ఈ ఏడాది సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇతడు నటించిన మరో సినిమా సవ్యసాచి అట్టర్ ఫ్లాప్ అయింది.

ఈ ఏడాది కొన్ని ఊహించని విజయాలు కూడా నమోదయ్యాయి. చాపకింద నీరులా వచ్చిన సుశాంత్, చిలసౌ మూవీతో తన రేంజ్ హిట్ అందుకోగా.. అడవి శేష్ మారోసారి మెరిశాడు. గూఢచారి లాంటి స్పై థ్రిల్లర్ తో అందర్నీ కట్టిపడేశాడు. ఇక ఆర్ఎక్స్100తో కార్తికేయ డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకోగా.. జై సింహా తో బాలయ్య, దేవదాస్ తో నాని-నాగ్ ఫర్వాలేదనిపించుకున్నారు. అయితే వీళ్లిద్దరూ విడివిడిగా చేసిన కృష్ణార్జున యుద్ధం, ఆఫీసర్ సినిమాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

ఇప్పటివరకు చెప్పుకున్న ఈ హీరోలంతా ఎలాగోలా గట్టెక్కేశారు. కానీ ఈ ఏడాది బొక్కబోర్లాపడిన హీరోల జాబితా కూడా పెద్దగానే ఉంది. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు పవన్ కల్యాణ్. అజ్ఞాతవాసి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీని అందించాడు పవన్. అటు నా పేరు సూర్య అంటూ వచ్చిన అల్లు అర్జున్ కూడా మామ సరసన చేరిపోయాడు. ఇలా ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చి ఫ్లాపులిచ్చిన హీరోలుగా పవన్-బన్నీ నిలిచిపోతారు.

ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కల్యాణం సినిమాలతో నితిన్ ఫ్లాపులిస్తే.. ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు సినిమాలతో సాయిధరమ్ తేజ్ ఫ్లాపులిచ్చాడు. వీళ్లు రెండేసి ఫ్లాపులిస్తే రాజ్ తరుణ్, రవితేజ ఏకంగా మూడేసి ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టారు.

సందీప్ కిషన్, గోపీచంద్, కల్యాణ్ రామ్ లాంటి హీరోలు మరోసారి నిరాశపరచగా… నిఖిల్, రామ్, శర్వానంద్ లాంటి హీరోలు ఓ మోస్తరు అంచనాలతో వచ్చి బోల్తాకొట్టారు. ఇలా హీరోల జాబితాలో ఈ ఏడాది సరిగ్గా సగం మంది హిట్స్ కొడితే, మిగతా సగం మంది ఫ్లాపులతో ముగించారు.

First Published:  31 Dec 2018 3:25 PM IST
Next Story