గుంటూరు జిల్లాకు ఐదుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఏపీకి వస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకు ఐదుగురు టీఆర్ఎస్ యాదవ ఎమ్మెల్యేలు నేడు రానున్నారు. సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వీరు వస్తున్నారు. వైసీపీ నేత జంగాకృష్ణమూర్తి కుమారుడు కోటయ్య ఆధ్వర్యంలో ఐదుగురు టీఆర్ఎస్ యాదవ ఎమ్మెల్యేలకు సన్మానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా యాదవులను ఆహ్వానించారు. తమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను సన్మానించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని…. దీని వెనుక రాజకీయ […]

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఏపీకి వస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకు ఐదుగురు టీఆర్ఎస్ యాదవ ఎమ్మెల్యేలు నేడు రానున్నారు.
సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వీరు వస్తున్నారు. వైసీపీ నేత జంగాకృష్ణమూర్తి కుమారుడు కోటయ్య ఆధ్వర్యంలో ఐదుగురు టీఆర్ఎస్ యాదవ ఎమ్మెల్యేలకు సన్మానం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి భారీగా యాదవులను ఆహ్వానించారు. తమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను సన్మానించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని…. దీని వెనుక రాజకీయ కారణాలేవీ లేవని నిర్వాహకులు తెలిపారు.