Telugu Global
Cinema & Entertainment

ఫస్ట్ టైం డబ్బులు తీసుకోవడం లేదు

 సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్ట్ మేటర్ బయటకొచ్చింది. ఈ సినిమా కోసం నాని డబ్బులు తీసుకోవడం లేదు. అవును.. స్టార్ హీరోల టైపులో లాభాల్లో వాటా లేదా ఏదో ఒక ఏరియా రైట్స్ తీసుకోవాలని నాని నిర్ణయించుకున్నాడట. ఆ ఒప్పందం మేరకే ఈ ప్రాజెక్టులోకి నాని అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ అంటే హారిక-హాసిని బ్యానర్ కు బ్రాంచ్ […]

ఫస్ట్ టైం డబ్బులు తీసుకోవడం లేదు
X

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్ట్ మేటర్ బయటకొచ్చింది. ఈ సినిమా కోసం నాని డబ్బులు తీసుకోవడం లేదు. అవును.. స్టార్ హీరోల టైపులో లాభాల్లో వాటా లేదా ఏదో ఒక ఏరియా రైట్స్ తీసుకోవాలని నాని నిర్ణయించుకున్నాడట. ఆ ఒప్పందం మేరకే ఈ ప్రాజెక్టులోకి నాని అడుగుపెట్టినట్టు తెలుస్తోంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ అంటే హారిక-హాసిని బ్యానర్ కు బ్రాంచ్ లాంటిది. పేరుకు ఇద్దరు నిర్మాతలు ఉన్నప్పటికీ కీలకమైన నిర్ణయాలన్నీ రాధాకృష్ణ తీసుకుంటారు. బిజినెస్ లో వాటాలు ఇవ్వడం రాధాకృష్ణకు అస్సలు ఇష్టం ఉండదు. అవసరమైతే కోటి రూపాయలు అదనంగానైనా చెల్లిస్తారు కానీ బిజినెస్ పార్టనర్ గా మాత్రం ఎవర్నీ తీసుకోరు. సినిమాకు సంబంధించి కష్టమైనా, సుఖమైనా తనే చూసుకుంటారు.

ఇలాంటి నిర్మాత, నానిని జెర్సీ సినిమాలో పార్టనర్ గా తీసుకుంటారని ఊహించలేం. కానీ ఫిలింనగర్ లో వినిపిస్తున్న పుకార్ల ప్రకారం.. నాని కూడా ఇందులో వాటాదారు అనే వాదన వినిపిస్తోంది. కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ తర్వాత నానికి ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వాలనే అంశంపై చాలా చర్చ నడిచింది. ఆ చర్చకు సమాధానంగా నాని ఇలా పారితోషికం తీసుకోకుండా, వాటాదారుగా మారాడనే ప్రచారం జోరుగా సాగుతోంది

First Published:  30 Dec 2018 7:52 AM
Next Story