లగేజీ మోస్తే అంతే... సీఎం రమేష్ గన్‌మెన్‌పై సస్పెన్షన్ వేటు
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ గన్‌మెన్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. అతడిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం రమేష్‌కు గన్‌మెన్‌గా ఉంటున్న చక్రి నిర్లక్ష్యమే ఈ వేటుకు కారణమైంది. ఇటీవల సీఎం రమేష్‌తో కలిసి గన్‌మెన్ చక్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్లకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ఎర్రగుంట్ల స్టేషన్ రాగానే తెల్లవారుజామున నాలున్నరకు సీఎం రమేష్‌తో కలిసి గన్‌మెన్ చక్రి ట్రైన్ దిగారు. సీఎం రమేష్ ఉత్తిచేతులతో ట్రైన్ దిగగా… గన్‌మెన్ చక్రి సీఎం […]
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ గన్‌మెన్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. అతడిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం రమేష్‌కు గన్‌మెన్‌గా ఉంటున్న చక్రి నిర్లక్ష్యమే ఈ వేటుకు కారణమైంది.
ఇటీవల సీఎం రమేష్‌తో కలిసి గన్‌మెన్ చక్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్లకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ఎర్రగుంట్ల స్టేషన్ రాగానే తెల్లవారుజామున నాలున్నరకు సీఎం రమేష్‌తో కలిసి గన్‌మెన్ చక్రి ట్రైన్ దిగారు.
సీఎం రమేష్ ఉత్తిచేతులతో ట్రైన్ దిగగా… గన్‌మెన్ చక్రి సీఎం రమేష్‌కు చెందిన లగేజీ మొత్తం భుజాన వేసుకుని దిగారు. ఆ సమయంలో చక్రి తన గన్‌ను ట్రైన్ లోనే మరిచిపోయాడు. ఆ విషయాన్ని వెంటనే గుర్తించలేదు. అయితే సీఎం రమేష్ ప్రయాణించిన సీటు వద్ద తుపాకి ఉండడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు.
ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో రిజర్వేషన్ చార్ట్ ఆధారంగా సీఎం రమేష్ గన్‌మెన్‌కు చెందిన తుపాకి అయి ఉంటుందని రైల్వే పోలీసులు అంచనాకు వచ్చి సమాచారం అందించారు. ఉదయం 8.30 గంటలకు వరకూ తుపాకీ మిస్ అయిన అంశాన్ని చక్రి పట్టించుకోలేదు.
రైల్వే పోలీసుల నుంచి సమాచారం రావడంతో అప్పుడు తుపాకీ మిస్ అయిందని గుర్తించి హైరానా పడ్డాడు. వెంకట్రాది ఎక్స్‌ప్రెస్ చివరి స్టాప్ చిత్తూరుకు చేరుకుని చక్రి తన వివరాలు తెలియజేసి తుపాకీ తెచ్చుకున్నాడు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు… తుపాకీని బోగిలో వదిలేసి వచ్చిందుకు చక్రిపై వేటు వేశారు. అయితే గన్‌మెన్లను భద్రత కోసం కాకుండా నాయకులు వ్యక్తిగత లగేజ్ మోసేందుకు వాడుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ట్రైన్ దిగే క్రమంలో సీఎం రమేష్ లగేజీకి ప్రాధాన్యత ఇచ్చిన గన్‌మెన్ చక్రి… ఆ ప్రయత్నంలో తన తుపాకీని మరిచిపోయారని వివరిస్తున్నారు. నాయకులు గన్‌మెన్‌లను సొంత పనులకు కాకుండా… భద్రతకు మాత్రమే వాడుకుంటే అందరికీ మంచిదని అభిప్రాయపడుతున్నారు.