Telugu Global
NEWS

బిక్కుబిక్కుమంటూ సముద్రం మధ్యలో 20 గంటల పాటు బాలుడు

విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు మత్స్యకారులు మృత్యువుతో పోరాటం చేశారు. సముద్రం మధ్యలో చిక్కుకుపోయి 20 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదృష్టవశాత్తు మెరైన్‌ పోలీసుల కంటపడడంతో ప్రాణాలతో బయటపడ్డారు. పూసపాటిరేగ మండలం చింతపల్లి బర్రిపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు వేటకు వెళ్లారు. ఈ ఇద్దరిలో 12 ఏళ్ల బర్రి అప్పన్న కూడా ఉన్నాడు. తన తండ్రి ఇటీవలే చనిపోవడంతో కుటుంబ భారాన్ని తనపై వేసుకున్నాడు బర్రి అప్పన్న. బర్రి రాము […]

బిక్కుబిక్కుమంటూ సముద్రం మధ్యలో 20 గంటల పాటు బాలుడు
X

విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు మత్స్యకారులు మృత్యువుతో పోరాటం చేశారు. సముద్రం మధ్యలో చిక్కుకుపోయి 20 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదృష్టవశాత్తు మెరైన్‌ పోలీసుల కంటపడడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

పూసపాటిరేగ మండలం చింతపల్లి బర్రిపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు వేటకు వెళ్లారు. ఈ ఇద్దరిలో 12 ఏళ్ల బర్రి అప్పన్న కూడా ఉన్నాడు. తన తండ్రి ఇటీవలే చనిపోవడంతో కుటుంబ భారాన్ని తనపై వేసుకున్నాడు బర్రి అప్పన్న. బర్రి రాము అనే వ్యక్తితో కలిసి వేటకు వెళ్లాడు.

రుషికొండకు 40 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలోకి వెళ్లారు. అయితే హఠాత్తుగా వచ్చిన గాలులకు పడవ బోల్తా పడింది. ఇద్దరు చెరో దిక్కుకు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన బర్రి రాము… బాలుడు బర్రి అప్పన్నను బోల్తాపడిన పడవ వద్దకు చేర్చాడు. ఇద్దరూ బోల్తా పడిన పడవపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు.

సాయంత్రానికి వీరు రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిగిలిన మత్స్యకారులు 20 ఇంజన్‌ బోట్లను వేసుకుని తలో దిక్కుకు వెళ్లారు. బోల్తా పడిన పడవ గాలి వాటుకు తీరం వైపు రావడం మొదలైంది. అయినప్పటికీ బయటపడే పరిస్థితి కనిపించలేదు.

శనివారం రాత్రంతా గడ్డకట్టే చలిలో బర్రిరాము, బర్రి అప్పన్నలు బిక్కుబిక్కుమంటూ బోల్తాపడిన పడవపైనే ఉండిపోయారు. దాదాపు 20 గంటల తర్వాత మెరైన్ పోలీసులకు వీరు కంటపడ్డారు. దాంతో వెంటనే వారిని తమ బోటులోకి ఎక్కించుకుని గట్టుకు చేర్చారు. అప్పటికే భర్తను కోల్పోయిన అప్పన్న తల్లి… తన 12 ఏళ్ల కుమారుడు సురక్షితంగా ఒడ్డుకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

First Published:  30 Dec 2018 7:58 AM GMT
Next Story