Telugu Global
CRIME

తిరుమల బాలుడి ఆచూకీ లభ్యం.... కిడ్నాపర్ ను పట్టించింది ఇదే....

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో రెండు రోజుల క్రితం కిడ్నాపైన బాలుడి అచూకీ లభించింది. తిరుమలలో విడిది కేంద్రంలో బయట తల్లిదండ్రులతో పడుకున్న బాలుడు కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది.  నాదేండ్ లో అక్కడి పోలీసులు బాలుడి ఆచూకీ గుర్తించారు. విషయాన్ని ఏపీ పోలీసులకు చేరవేశారు.   తిరుమలలో స్నానానికి వెళ్లిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూసేసరికి బాలుడు వీరేష్ కనిపించలేదు. దీంతో కేసు నమోదు చేసిన  పోలీసులు … రెడ్ మంకీ క్యాప్ పెట్టుకున్న కిడ్నాపర్ బాలుడిని పట్టుకొని […]

తిరుమల బాలుడి ఆచూకీ లభ్యం.... కిడ్నాపర్ ను పట్టించింది ఇదే....
X

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో రెండు రోజుల క్రితం కిడ్నాపైన బాలుడి అచూకీ లభించింది. తిరుమలలో విడిది కేంద్రంలో బయట తల్లిదండ్రులతో పడుకున్న బాలుడు కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. నాదేండ్ లో అక్కడి పోలీసులు బాలుడి ఆచూకీ గుర్తించారు. విషయాన్ని ఏపీ పోలీసులకు చేరవేశారు.

తిరుమలలో స్నానానికి వెళ్లిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూసేసరికి బాలుడు వీరేష్ కనిపించలేదు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు … రెడ్ మంకీ క్యాప్ పెట్టుకున్న కిడ్నాపర్ బాలుడిని పట్టుకొని తీసుకెళుతున్నట్టు సీసీ కెమెరాల్లో చిక్కింది. దీంతో విచారణ జరిపిన పోలీసులకు కిడ్నాపర్ తీసుకున్న వసతి గది కీలక సాక్ష్యంగా కనిపించింది. బాలుడిని పట్టుకోవడంలో ఇదే పోలీసులకు కీలకంగా మారింది.

రెండు రోజుల క్రితం వీరేష్ అనే బాలుడిని ఎత్తుకెల్లిన కిడ్నాపర్ తను తీసుకున్న గదిని తిరిగి ఆలయ గదుల నిర్వాహకులకు అప్పగించలేదు. తాళం వేసుకొని అలానే ఉడాయించాడు. దీంతో అలా రెండు రోజులైనా తాళం అప్పగించని వారి లిస్ట్ ను బేరీజు వేసుకున్న పోలీసులకు కిడ్నాపర్ రూము తీసుకునేందుకు ఇచ్చిన ఆధార్ కార్డ్ కీలక సాక్ష్యంగా మారింది. అందులో కిడ్నాపర్ మహారాష్ట్రలోని తన అడ్రస్ పేర్కొనడంతో పోలీసులు వెంటనే అక్కడికి పయనమయ్యారు.

పోలీసులు ఊహించినట్టే కిడ్నాపర్ బాలుడిని అక్కడే దాచాడు. మహారాష్ట్ర పోలీసుల సాయంతో బాలుడిని స్వాధీనం చేసుకొని కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ వదిలివెళ్లిన సాక్ష్యమే అతడిని పట్టించడంలో కీలకంగా మారిందని తిరుపతి వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

First Published:  30 Dec 2018 12:14 AM GMT
Next Story