Telugu Global
NEWS

జేసీ దివాకర్‌ను నమ్మి వెళ్లారు.... ఇప్పుడు రాజీనామా చేశారు....

అనంతపురం జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని నెలల క్రితమే టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు. చంద్రబాబు పాలన బాగుందని భ్రమించి టీడీపీలో చేరి తప్పు చేశానని వ్యాఖ్యానించారు. తప్పు సరిదిద్దుకునేందుకు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనతోపాటు ఐదుగురు కార్పొరేటర్లు కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు వివరించారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు గురించి స్పష్టత ఇస్తానని గుర్నాథరెడ్డి […]

జేసీ దివాకర్‌ను నమ్మి వెళ్లారు.... ఇప్పుడు రాజీనామా చేశారు....
X

అనంతపురం జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని నెలల క్రితమే టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు.

చంద్రబాబు పాలన బాగుందని భ్రమించి టీడీపీలో చేరి తప్పు చేశానని వ్యాఖ్యానించారు. తప్పు సరిదిద్దుకునేందుకు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనతోపాటు ఐదుగురు కార్పొరేటర్లు కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు వివరించారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు గురించి స్పష్టత ఇస్తానని గుర్నాథరెడ్డి వెల్లడించారు.

వైఎస్‌ కుటుంబానికి, గుర్నాథరెడ్డి కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలుండేవి. అయితే అనంతపురం అర్బన్‌ నియోజక వర్గానికి తనను కాకుండా మరొకరిని ఇన్‌చార్జ్ గా నియమించడంతో గుర్నాథ రెడ్డి నొచ్చుకున్నారు. అదే సమయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పావులు కదిపారు.

టీడీపీలో చేరితే మిస్సమ్మ భూముల వివాదాన్ని పరిష్కరించడంతో పాటు… నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని ఒప్పించారు. జేసీ ప్రోద్బలంతో గుర్నాథ రెడ్డి టీడీపీలో చేరారు. కానీ ఆయనకు ఎలాంటి పదవి వరించలేదు. ఆయన పరిస్థితి ఎటూ కాకుండాపోయింది. రాజకీయంగా తన ప్రాధాన్యతను కోల్పోతూ వచ్చారు.

గుర్నాథరెడ్డి సోదరుల కుమారులు కూడా ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వైఎస్‌ జగన్‌ను కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గుర్నాథరెడ్డి కూడా టీడీపీని వీడారు. త్వరలో ఆయన కూడా వైసీపీలో చేరే అవకాశం ఉంది.

First Published:  30 Dec 2018 9:31 AM IST
Next Story