Telugu Global
Cinema & Entertainment

కచ్చితంగా ఇది హను రాఘవపూడి తప్పే!

శర్వానంద్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన పడిపడి లేచే మనసు సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు మాత్రం సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉండేవి. ఎందుకంటే మార్కెట్లో శర్వానంద్, సాయిపల్లవి ఇద్దరికీ మార్కెట్ ఉంది. అయినప్పటికీ ఈ సినిమా 5-6 కోట్ల రూపాయల నష్టంతో క్లోజ్ అయ్యే ప్రమాదంలో పడింది. హీరోహీరోయిన్ల క్రేజ్ కారణంగా విడుదలకు ముందే సినిమా బిజినెస్ పూర్తిచేశారు. సీడెడ్, డిజిటల్, […]

కచ్చితంగా ఇది హను రాఘవపూడి తప్పే!
X
శర్వానంద్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన పడిపడి లేచే మనసు సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు మాత్రం సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉండేవి. ఎందుకంటే మార్కెట్లో శర్వానంద్, సాయిపల్లవి ఇద్దరికీ మార్కెట్ ఉంది. అయినప్పటికీ ఈ సినిమా 5-6 కోట్ల రూపాయల నష్టంతో క్లోజ్ అయ్యే ప్రమాదంలో పడింది.
హీరోహీరోయిన్ల క్రేజ్ కారణంగా విడుదలకు ముందే సినిమా బిజినెస్ పూర్తిచేశారు. సీడెడ్, డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్.. ఇలా చాలా రకాల బిజినెస్ లు క్లోజ్ చేశారు. కానీ ఆంధ్రాలో మాత్రం సమస్య రావడంతో నేరుగా నిర్మాతలే రిలీజ్ చేశారు. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఇప్పుడా నష్టం నిర్మాతలపై పడింది.
ఆంధ్రా నుంచి నష్టం వచ్చినా నిర్మాతలు సేఫ్ గానే ఉండేవారు. కానీ ఇక్కడే హను రాఘవపూడి దెబ్బకొట్టాడు. 25 కోట్లలో పూర్తిచేయాల్సిన సినిమాను 32 కోట్ల వరకు ఈడ్చాడు. దాదాపు నెల రోజులు ఎక్స్ ట్రా టైమ్ తీసుకున్నాడు. అవసరం లేకపోయినా ఓ భారీ సెట్ వేయించాడు. నిజంగా ముందే ప్లాన్ చేసుకున్నట్టు పాతిక కోట్లలో సినిమా పూర్తిచేసి ఉంటే, ఆంధ్రాలో వచ్చే నష్టాలు కూడా కవర్ అయి.. కోటి, 2 కోట్ల లాభంతో నిర్మాత బయటపడేవాడు. కానీ ఇప్పుడు 5-6 కోట్ల నష్టం భరించాల్సి రావొచ్చు.
First Published:  29 Dec 2018 8:19 PM GMT
Next Story