Telugu Global
NEWS

ఫ్యూజన్‌ ఫుడ్స్ తెరుచుకుంది.... సిట్‌ ఆఫీస్‌ మూతపడింది....

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసును…. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా లేదా అన్న దానిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే… ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ అటకెక్కేసింది. కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ కార్యాలయాన్ని మూసేశారు. దాడి వెనుక ఎవరున్నది తేల్చకుండానే సిట్‌ కార్యాలయానికి తాళం పడడం చర్చనీయాంశమైంది. మధురవాడ జోన్ ఏసీపీ నాగేశ్వరరావు ఈ సిట్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఎయిర్‌పోర్టు స్టేషన్‌లోనే ఒక భవనాన్ని ఈ కేసు దర్యాప్తు […]

ఫ్యూజన్‌ ఫుడ్స్ తెరుచుకుంది.... సిట్‌ ఆఫీస్‌ మూతపడింది....
X

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసును…. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా లేదా అన్న దానిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే… ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ అటకెక్కేసింది. కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ కార్యాలయాన్ని మూసేశారు.

దాడి వెనుక ఎవరున్నది తేల్చకుండానే సిట్‌ కార్యాలయానికి తాళం పడడం చర్చనీయాంశమైంది. మధురవాడ జోన్ ఏసీపీ నాగేశ్వరరావు ఈ సిట్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఎయిర్‌పోర్టు స్టేషన్‌లోనే ఒక భవనాన్ని ఈ కేసు దర్యాప్తు బృందం కోసం కేటాయించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే కేసు విచారణ ఆగిపోయిందని సిట్ లోని కొందరు పోలీసులు చెబుతున్నారు. అందుకే కార్యాలయానికి కూడా తాళం వేసి ఎవరి పని వారు చూసుకుంటున్నట్టు వివరించారు.

మరోవైపు దాడి చేసిన శ్రీనివాసరావుకు ఆశ్రయం, ఉద్యోగం కల్పించడంతో పాటు కత్తిని ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లడంలో సహకరించిన హర్షవర్థన్‌ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్‌ రెస్టారెంట్‌ మాత్రం తిరిగి ఎంచక్కా ఎయిర్‌పోర్టులో కొనసాగుతోంది.

ఎన్‌వోసీ లేకుండానే ఉద్యోగులను తీసుకొచ్చి రెస్టారెంట్‌లో పనిచేయిస్తున్నారని తేలినా హర్షవర్థన్‌ చౌదరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎయిర్‌పోర్టు అధికారులు కూడా రెస్టారెంట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.

First Published:  29 Dec 2018 5:15 AM IST
Next Story