103 స్థానాల్లో డిపాజిట్లు పోయినా బుద్ధి రాలేదా?- కేసీఆర్ ప్రెస్‌మీట్
పసలేని ఆరోపణలు చేస్తే ప్రజలు బుద్ధి చెబుతారని ప్రతిపక్షాలను హెచ్చరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 103 స్థానాల్లో డిపాజిట్లు రాకుండా చేసినా బీజేపీకి బుద్ది రాలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తాము కావాలని తగ్గించలేదన్నారు. కోర్టు ఆదేశాల మేరకే నడుచుకున్నామని చెప్పారు. ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్… టీఆర్‌ఎస్ రాకముందు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు కేవలం 19 ఉండేవని…. ఇప్పుడు ఆ సంఖ్య 261కి పెరిగిందన్నారు. దీన్ని బట్టే బీసీలపై ఎవరికి […]
పసలేని ఆరోపణలు చేస్తే ప్రజలు బుద్ధి చెబుతారని ప్రతిపక్షాలను హెచ్చరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 103 స్థానాల్లో డిపాజిట్లు రాకుండా చేసినా బీజేపీకి బుద్ది రాలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తాము కావాలని తగ్గించలేదన్నారు. కోర్టు ఆదేశాల మేరకే నడుచుకున్నామని చెప్పారు.
ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్… టీఆర్‌ఎస్ రాకముందు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు కేవలం 19 ఉండేవని…. ఇప్పుడు ఆ సంఖ్య 261కి పెరిగిందన్నారు. దీన్ని బట్టే బీసీలపై ఎవరికి ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూదని సుప్రీం కోర్టు చెప్పడం వల్లే బీసీ రిజర్వేషన్ల కోటా తగ్గిపోయిందన్నారు.
ఆత్మగౌరవ భవనాల పేరుతో అన్ని వర్గాలను గుర్తించిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. జనవరిలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పారు. మార్కెట్ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదేనన్నారు. తెలంగాణలో యాదవులకు 74 లక్షల గొర్రెలు పంపిణీ చేశామన్నారు.
ప్రతి సామాజికవర్గం పట్ల టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ది ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిన నేపథ్యంలో జనరల్ స్థానాల్లోనూ బీసీలకు అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని కోర్టుకు వెళ్లిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లేనన్నారు.
రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హైకోర్టు చెప్పగానే సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్లామని అక్కడ కూడా రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు.
అదే సమయంలో జనవరి పది లోపు పంచాయతీ ఎన్నికల నిర్వహించి తీరాలని హైకోర్టు తీర్పు చెప్పిందని ఈ నేపథ్యంలోనే మరోదారి లేక తాము బీసీల రిజర్వేషన్లు పెంచలేకపోయామన్నారు. రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదని కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు.