Telugu Global
NEWS

చంద్రబాబుకు ఏపీలో ఘోరమైన ఓటమి ఖాయం.... హైటెక్ సిటీ కథ చెప్పిన కేసీఆర్

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని రాజ్యసభలో తమ ఎంపీ కేశవరావు స్వయంగా డిమాండ్ చేశారని… ఇప్పుడు మాత్రం చంద్రబాబు కేసీఆర్‌ హోదాకు అడ్డుపడుతున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి అని అవసరమైతే ఇప్పుడు కూడా తాను మోడీకి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నానని కేసీఆర్‌ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలో ఎంపీ కవిత కూడా డిమాండ్ చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. చంద్రబాబు విపరీతమైన అవినీతి చేస్తున్నాడని… ప్రజా సంక్షేమం […]

చంద్రబాబుకు ఏపీలో ఘోరమైన ఓటమి ఖాయం.... హైటెక్ సిటీ కథ చెప్పిన కేసీఆర్
X

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని రాజ్యసభలో తమ ఎంపీ కేశవరావు స్వయంగా డిమాండ్ చేశారని… ఇప్పుడు మాత్రం చంద్రబాబు కేసీఆర్‌ హోదాకు అడ్డుపడుతున్నారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి అని అవసరమైతే ఇప్పుడు కూడా తాను మోడీకి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నానని కేసీఆర్‌ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలో ఎంపీ కవిత కూడా డిమాండ్ చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.

చంద్రబాబు విపరీతమైన అవినీతి చేస్తున్నాడని… ప్రజా సంక్షేమం మీద చంద్రబాబు దృష్టి పెట్టక పోవడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు. పాలించడం చేతగాక ఇతరులపై పడి ఏడవడం చంద్రబాబుకు అలవాటైందన్నారు.

ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే జైలుకు పంపిస్తా అని ఇదే చంద్రబాబు హెచ్చరించింది నిజం కాదా అని ప్రశ్నించారు. హోదా ఏమైనా సంజీవినా అన్న వ్యక్తి చంద్రబాబు కాదా అని నిలదీశారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారన్నారు.

సీఎం హోదాలో వెళ్లి పీఎం మోడీని కలిస్తే అభ్యంతరం చెబుతున్న చంద్రబాబు… ఇదే మోడీ చంకను నాలుగేళ్ల పాటు నాకలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు స్వయం ప్రకాశం లేని వ్యక్తి అన్నారు. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీని లాక్కుని దాన్ని మేనేజ్‌ చేస్తున్నారన్నారు.

తాను చంద్రబాబులాంటి వ్యక్తిని కాదని… ఇద్దరి ఎంపీలతో పోరాటం మొదలుపెట్టి తెలంగాణ సాధించుకొచ్చిన చరిత్ర తనదన్నారు. తాను చంద్రబాబులాగా నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తిని కాదన్నారు. తాను విశాఖకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు తనకు అభివాదం చేసినా చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారన్నారు.

తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని … అక్షర దోషాలతో సహా కాపీకొట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు కేంద్రంలో ఎప్పుడూ చక్రం తిప్పింది లేదన్నారు. చంద్రబాబు చక్కగా నాలుగు ఇంగ్లీష్ పదాలు, చక్కగా రెండు హిందీ పదాలు మాట్లాడడం వచ్చా అని ప్రశ్నించారు. అలాంటి చంద్రబాబు నేషనల్ లెవల్ లో తెలుగులో మాట్లాడుతూ చక్రం తిప్పుతారా అని ఎద్దేవా చేశారు. కేవలం పత్రికల్లో డబ్బా కొట్టించుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసన్నారు.

హైదరాబాద్‌ ఐటీలోనూ చంద్రబాబు పీకిందేమీ లేదన్నారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేసింది నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని కేసీఆర్‌ చెప్పారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు మాత్రం తానే కట్టానని పత్రికల ద్వారా ప్రచారం చేయించుకుని మార్కెట్‌ చేయించుకున్నారన్నారు.

తాను శారదాపీఠానికి వెళ్తే వేలాది మంది ప్రజలు వచ్చి అభివాదం చేశారన్నారు. కానీ చంద్రబాబుకు చెందిన ఒక బాకా పత్రిక వైసీపీ వాళ్లు జనాన్ని తెచ్చారని… మరో బాకా పత్రిక వెలమ కులస్తులు స్వాగతం పలికారని రాసిందన్నారు. ఇలా రాయడం మీడియా నీతా అని ప్రశ్నించారు. వెలమ వాళ్లు మనుషులు కాదా అని ప్రశ్నించారు.

ఎందుకు ఇంతమంది వచ్చారని తాను అక్కడి వారిని ప్రశ్నిస్తే… తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు పళ్లు ఊడగొట్టినందుకు ఆనందంతో అభివాదం చేసేందుకు వచ్చినట్లు వివరించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి చంద్రబాబుకు అత్యంత ఘోరమైన ఓటమి తప్పదన్నారు. ఏపీలో చంద్రబాబును ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించబోతున్నారని కేసీఆర్ జోస్యం చెప్పారు.

First Published:  29 Dec 2018 7:43 AM GMT
Next Story