మోడీకి ఇక 9 వారాల టైమే ఉంది !
2019 సార్వత్రిక ఎన్నికల సమరానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా తొమ్మిది వారాల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. 2014 ఎన్నికలు మార్చి 5న షెడ్యూల్ విడుదలైంది. ఈ సారి కూడా అదే టైమ్‌లో విడుదలయ్యే అవకాశం కన్పిస్తోంది. మొత్తానికి ప్రధానమంత్రి మోడీకి ఇంకా తొమ్మిది వారాల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో మోడీ ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు? ఏఏ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఏఏ రాజకీయ ఎత్తుగడులు ముందుకు తీసుకువస్తారనేది ఆసక్తికరంగా మారింది. పట్టణప్రాంతాల్లో […]
2019 సార్వత్రిక ఎన్నికల సమరానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా తొమ్మిది వారాల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. 2014 ఎన్నికలు మార్చి 5న షెడ్యూల్ విడుదలైంది. ఈ సారి కూడా అదే టైమ్‌లో విడుదలయ్యే అవకాశం కన్పిస్తోంది.
మొత్తానికి ప్రధానమంత్రి మోడీకి ఇంకా తొమ్మిది వారాల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో మోడీ ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు? ఏఏ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఏఏ రాజకీయ ఎత్తుగడులు ముందుకు తీసుకువస్తారనేది ఆసక్తికరంగా మారింది.
పట్టణప్రాంతాల్లో మోడీకి ఇప్పటికీ ఆదరణ ఉంది. ఈ విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మోడీ గ్రాఫ్ పడిపోతోంది. దీంతో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఓ పథకం తీసుకొస్తారన్న ప్రచారం జరుగుతోంది. రైతు బంధు తరహాలో దేశవ్యాప్తంగా ఓ స్కీమ్ అందుబాటులోకి తీసుకొస్తారని అంటున్నారు. ఈ పథకం తయారీలో ఇప్పటికే మోడీ అండ్ కో బిజీబిజీగా ఉంది. త్వరలోనే ఈ స్కీమ్ ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.
బీహార్‌లో ఇప్పటికే సీట్ల పంపకం పూర్తయింది. ఇక ఉత్తరప్రదేశ్‌లో కూటమి రాజకీయాలపై చర్చలు నడుస్తున్నాయి. అమిత్‌షా ఇప్పటికే పలు రాష్ట్రాలలో ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. సైలెంట్‌గా తన కార్యాచరణ మొదలుపెట్టారు.
మొత్తానికి రాబోయే రోజుల్లో మోడీ కీలక ప్రకటనలు చేయబోతున్నారని తెలుస్తోంది. తమకు పట్టున్న రాష్ట్రాలతో పాటు కొత్త ప్రదేశాల్లో మోడీ సభలు ఈ సారి ఉండబోతున్నాయని తెలుస్తోంది.