Telugu Global
National

అంతరిక్ష యాత్రకు మోడీ ఆమోదం....

అంతరిక్ష రంగంలో సత్తా చాటుతున్న భారత్ మరో అడుగు ముందుకేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష యాత్రకు సిద్దమవుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిన గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. 10వేల కోట్లతో ఈ గగన్‌యాన్ ప్రాజెక్టు చేపడుతున్నారు. ముగ్గురు వ్యోమగాములను వారం పాటు అంతరిక్షంలోకి పంపించనున్నారు. 2022నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇస్రో పట్టుదలతో ఉంది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో […]

అంతరిక్ష యాత్రకు మోడీ ఆమోదం....
X

అంతరిక్ష రంగంలో సత్తా చాటుతున్న భారత్ మరో అడుగు ముందుకేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష యాత్రకు సిద్దమవుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిన గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.

10వేల కోట్లతో ఈ గగన్‌యాన్ ప్రాజెక్టు చేపడుతున్నారు. ముగ్గురు వ్యోమగాములను వారం పాటు అంతరిక్షంలోకి పంపించనున్నారు. 2022నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇస్రో పట్టుదలతో ఉంది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గగన్‌యాన్‌ పనులు ఊపందుకోనున్నాయి.

ఈప్రయోగం విజయవంతమైతే…. మానవులను అంతరిక్షంలోకి పంపిన అమెరికా, రష్యా, చైనాల తర్వాత భారత్‌ నాలుగో దేశం అవుతుంది. ఈ ప్రయోగాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరిహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచే చేయనున్నారు.

వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే మాడ్యూల్‌ను జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 ద్వారా 2014లోనే ఇస్రో ప్రయోగించింది. దాదాపు 3, 745 కిలోల బరువున్న ఈ మాడ్యూల్‌ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి బంగాళాఖాతంలో విజయవంతంగా దిగింది. వ్యోమగాములను జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపుతారు.

First Published:  29 Dec 2018 2:39 AM IST
Next Story