ప్రధాని పదవే టార్గెట్! మరో రెండు యాగాలకు ముహూర్తం
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువే అని అందరికీ తెలిసిన విషయమే. సంఖ్యా శాస్త్రం, వాస్తు…. వీటన్నింటినీ కేసీఆర్ చాలా నమ్ముతారు. ఎలాంటి కార్యక్రమం అయినా సరే….మొదలు పెట్టాలంటే వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటారు. తాను తలపెట్టిన కార్యం విజయవంతం అయ్యేందుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు…. ఏర్పడిన తర్వాత ఎన్నో యాగాలు చేశారు సీఎం కేసీఆర్. మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015లో అయుత చండీయాగం నిర్వహించారు […]
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువే అని అందరికీ తెలిసిన విషయమే. సంఖ్యా శాస్త్రం, వాస్తు…. వీటన్నింటినీ కేసీఆర్ చాలా నమ్ముతారు. ఎలాంటి కార్యక్రమం అయినా సరే….మొదలు పెట్టాలంటే వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటారు.
తాను తలపెట్టిన కార్యం విజయవంతం అయ్యేందుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు…. ఏర్పడిన తర్వాత ఎన్నో యాగాలు చేశారు సీఎం కేసీఆర్. మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015లో అయుత చండీయాగం నిర్వహించారు సీఎం కేసీఆర్.
ఇక ఎన్నికల ముందు …ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజశ్యామలయాగం నిర్వహించారు గులాబీ దళపతి. ఈ యాగం అనంతరం ప్రచారంలో పాల్గొని… టీఆర్ఎస్ పార్టీని ఒంటిచేత్తో భారీ మెజార్టీతో గెలిపించారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత….. తనతో రాజశ్యామల యాగం చేయించిన విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రను సీఎం కేసీఆర్ దంపతులు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ఈ సమయంలో మరోసారి యాగం నిర్వహించాలని స్వరూపానందేంద్రతో చర్చించినట్లు సమాచారం.
జనవరి 21నుంచి ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్ లో మరోసారి యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. దీనిపై త్వరలోనే అధికారంగా ప్రకటన విడుదల చేయనున్నారు.
గులాబీ బాస్ ఏం యాగం చేయనున్నారు? దాని పేరేంటి? అనేది తెలుసుకోవాలంటే అధికార ప్రకటన వెలువడే వరకు వేచి ఉండాల్సిందే. రాజశ్యామల యాగంతో ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకున్న గులాబీ బాస్… మరోసారి యాగం చేపట్టి దేశ రాజకీయాల్లోనూ విజయం సాధిస్తారో లేదో వేచిచూడాల్సిందే.