ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడుతా.... అవసరమైతే ట్రంప్ సాయం తీసుకుంటా....
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో బంధీలుగా ఉన్న శ్రీకాకుళం మత్స్యకారులను తాను విడిపిస్తానని చెప్పారు. పాకిస్తాన్‌కు తాను నేరుగా వెళ్లగలనని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఎన్నికైన సమయంలోనూ తాను నార్వే నుంచి ఫోన్ చేసి అభినంధించినట్టు చెప్పారు. త్వరలోనే పాకిస్తాన్‌కు నేరుగా వెళ్లి బంధీలుగా ఉన్న శ్రీకాకుళం మత్స్యకారులను పరామర్శిస్తానని చెప్పారు. 22 మంది మత్స్యకారులను విడిపించేందుకు ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడుతానని… అవసరమైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ […]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో బంధీలుగా ఉన్న శ్రీకాకుళం మత్స్యకారులను తాను విడిపిస్తానని చెప్పారు. పాకిస్తాన్‌కు తాను నేరుగా వెళ్లగలనని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఎన్నికైన సమయంలోనూ తాను నార్వే నుంచి ఫోన్ చేసి అభినంధించినట్టు చెప్పారు.
త్వరలోనే పాకిస్తాన్‌కు నేరుగా వెళ్లి బంధీలుగా ఉన్న శ్రీకాకుళం మత్స్యకారులను పరామర్శిస్తానని చెప్పారు. 22 మంది మత్స్యకారులను విడిపించేందుకు ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడుతానని… అవసరమైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాయం కూడా తీసుకుంటానని పాల్ వివరించారు. తాను చేసే పనిని అందరూ త్వరలోనే చూస్తారన్నారు.
తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతుందని తానెప్పుడో చెప్పానని… ఏపీలో కూడా టీడీపీకి ఓటమి తప్పదన్నారు. ప్రజాశాంతి పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని… కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని వెళ్తామన్నారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేస్తానని ఎన్నిలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చుకోలేదని పాల్ ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానని కేఏ పాల్ చెప్పారు.